15 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఇక ఆస్ట్రేలియా గడ్డపై వరల్డ్ కప్ కొట్టి భారత క్రికెట్ ప్రేక్షకులందరిలో కూడా ఉత్సాహాన్ని నింపాలి అనుకున్న టీమిండియా అటు ఆస్ట్రేలియా గడ్డపై అడుగు పెట్టింది. ఇక అందరూ నమ్మకం పెట్టుకున్నట్లుగానే అటు వరుసగా మ్యాచ్లో విజయం సాధిస్తూ వచ్చింది టీమిండియా. ఇలా లీగ్ మ్యాచ్లలో అదరగొట్టిన టీమిండియా అటు కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్లో మాత్రం తడబడింది అని చెప్పాలి. దీంతో ఇంగ్లాండ్ చేతిలో పది వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసి ఇంటి దారి పట్టింది. అప్పటివరకు అద్భుతంగా రానించిన టీమిండియా ఏదో బ్యాడ్ లక్ వెంటాడినట్టు ఇంగ్లాండ్ కు కనీస పోటీ ఇవ్వలేకపోయింది.


 ఇక ఇలా వరుస విజయాలతో దూసుకుపోయిన టీమిండియా ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోవడానికి అసలు జీర్ణించుకోలేకపోతున్నారు టీమిండియ అభిమానులు. అయితే ఇక మ్యాచ్ ఓటమి తర్వాత ఏకంగా కెప్టెన్ రోహిత్ శర్మ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది. ఈ వీడియో అభిమానులందరినీ కూడా ఎంతగానో బాధ కలిగించింది అని చెప్పాలి.  అయితే ఇక వరల్డ్ కప్ లో సెమీఫైనల్ లో ఓటమిపై విరాట్ కోహ్లీ కూడా ఎంతో ఎమోషనల్ గా స్పందించాడు అని చెప్పాలి.

 మా కలను సహకారం చేసుకోకుండానే ఆస్ట్రేలియా గడ్డను వీడాల్సి వస్తుంది. ఇందుకు మేము ఎంతో బాధపడుతున్నాం. చిరస్మరణీయమైన జ్ఞాపకాలను వెంట తీసుకెళ్తున్నాం. ఇక్కడి నుంచి మరింత మెరుగవ్వాలని లక్ష్యాన్ని పెట్టుకున్నాము. మాకు మద్దతు ఇవ్వడానికి పెద్ద సంఖ్యలు హాజరైన అభిమానులకు ధన్యవాదాలు. భారత జెర్సీ ధరించి దేశానికి వస్తున్నందుకు ఎల్లప్పుడూ గర్వంగా భావిస్తా అంటూ విరాట్ కోహ్లీ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. అయితే ఈ ఏడాది ప్రపంచకప్ లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఏకంగా వరల్డ్ కప్ లోనే 296 పరుగులతో టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: