ఇది కల లేకపోతే నిజమా.. నిజంగానే భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఇలా మాట్లాడాడా.. ఎప్పుడు లేనిది గౌతమ్ గంభీర్ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం ఏంటి.. అసలు గౌతమ్ గంభీర్ ఎలాంటి మూడ్ లో ఉన్నాడు.. ప్రస్తుతం మహేంద్ర సింగ్ ధోని అభిమానులు అందరూ కూడా ఇలాగే  చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగింది అని అంటారా.. సాధారణంగా మహేంద్ర సింగ్ ధోని కి భారత క్రికెట్లో గొప్ప కెప్టెన్ గా పేరు ఉంది. ఇక టీమిండియా కు రెండు వరల్డ్ కప్ లను అందించిన వీరుడిగా ధోని గురించి గొప్పగా అభివర్ణిస్తూ ఉంటారు క్రికెట్ పండితులు.


 మిస్టర్ కూల్ కెప్టెన్ గా బెస్ట్ ఫినిషర్ గా అత్యుత్తమ వికెట్ కీపర్ గా కూడా మహేంద్రసింగ్ ధోనిని ఎంతో మంది ప్రేక్షకులు పిలుస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే అందరూ ధోనిపై ప్రశంసలు కురిపిస్తూ ఉంటే అటు భారత మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ మాత్రం ఎప్పుడూ ధోనిపై విమర్శలు చేస్తూ ఇక సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు అని చెప్పాలి. ధోని ఒక్కడి కారణంగానే వరల్డ్ కప్ రాలేదని అందరం కలిసి ఆడితేనే వరల్డ్ కప్ వచ్చిందని ధోని గొప్ప ఏమీ కాదు అంటూ ఇప్పటికే ఎన్నోసార్లు తన మనసులో ఉన్న కోపాన్ని మొత్తం పోస్టుల రూపంలో సోషల్ మీడియాలో పెట్టేసాడు.


 ఇలా ఎప్పుడు ధోని గురించి మాట్లాడిన అందులో  నెగిటివ్ కామెంట్లే ఎక్కువగా కనిపిస్తాయి. కానీ మొదటిసారి గౌతం గంభీర్ ధోని గురించి పాజిటివ్ గా స్పందించాడు. టి20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోవడం గురించి ప్రస్తావిస్తూ ధోని సాధించిన మూడు ఐసీసీ ట్రోఫీల రికార్డును ఏ భారత కెప్టెన్ సాధించలేడు అంటూ గౌతమ్ గంభీర్ ప్రశంసలు కురిపించాడు. భవిష్యత్తులో ఎవరో ఒకరు రోహిత్ డబుల్ సెంచరీల రికార్డుని కోహ్లీ సెంచరీల రికార్డును బద్దలు కొడతారేమో.. కానీ ధోని రికార్డులే చరిత్రలో నిలిచిపోతాయి అంటూ గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: