ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా టీమ్ ఇండియా వైఫల్యం ఇక జట్టుపై బాగా ప్రభావం చూపింది అన్నది తెలుస్తుంది. రానున్న రోజుల్లో ఇక వరల్డ్ కప్ లో చేసిన తప్పులను పునరావృతం చేయకుండా ఉండేలా ఏకంగా అనూహ్యమైన నిర్ణయాలు తీసుకునేందుకు అటు భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయించింది అన్నది తెలుస్తుంది. అయితే ఇటీవలే ఆస్ట్రేలియా వేదికగా జరిగిన వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా ఆటగాళ్లు ఫీల్డింగ్ లో పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. కొన్ని కొన్ని మ్యాచ్లలో అయితే ఫీల్డింగ్ లో టీమిండియ ఆటగాళ్లు తేలిపోయారు అని చెప్పాలి.



 ఈ క్రమం లోనే పలు భాషల్లో టీమిండియా ప్లేయర్స్ చేసిన ఫీల్డింగ్  పై విమర్శలు కూడా వచ్చాయి. ప్రస్తుతం వరల్డ్ నెంబర్ వన్ గా కొనసాగుతున్న జట్టు ఫీల్డింగ్ ఇలా ఉండడం ఏంటి అని ఎంతో మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇక టీమిండియా ఫీల్డింగ్ వైఫల్యం నేపథ్యం లో ఇక ఇటీవల బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది అన్నది తెలుస్తుంది. టీమిండియా కోచింగ్ సిబ్బంది లోకి కొత్త ఫీల్డింగ్  కోచ్ రాబోతున్నాడట. ఈ క్రమం లోనే మరికొన్ని రోజుల్లో టీమ్ ఇండియా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లబోతుంది అన్న విషయం తెలిసిందే.



 ఈ క్రమం లోనే న్యూజిలాండ్తో జరగ బోయే సిరీస్ లకు టీమిండియా కొత్త ఫీల్డింగ్ కోచ్ గా  మునిష్ బాలి కి బిసిసిఐ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తుంది. నవంబర్ 18 నుంచి ప్రారంభం కాబోతున్న భారత్ న్యూజిలాండ్ సిరీస్ లో ఇక అతడు టీమిండియా కు ఫీలింగ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టి అతని సలహాలను ఇవ్వబోతున్నాడు. అయితే మరోవైపు అటు రాహుల్ ద్రవిడ్ కు విశ్రాంతి ప్రకటించిన నేపద్యంలో ప్రస్తుతం తాత్కాలిక హెడ్ కోచ్గా వివిఎస్ లక్ష్మణ్ బాధ్యతలు చేపడుతున్నాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: