ఇటీవల కాలంలో ఏదైనా ద్వైపాక్షిక సిరీస్ జరిగిందంటే చాలు ఇక ఆయా జట్లకు సంబంధించిన మాజీ ఆటగాళ్లు తుది జట్టులో చోటు సంపాదించుకోబోయే ఆటగాళ్లు ఎవరు అన్న విషయంపై ఒక అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే తమ ప్లేయింగ్ ఎలెవన్ జట్టును సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇలా మాజీ ప్లేయర్స్ ప్లేయింగ్ జట్టును సోషల్ మీడియాలో ప్రకటించడం ఒక ట్రెండ్ గా మారిపోయింది.. అలాంటిది ఇక వరల్డ్ కప్ జరుగుతున్న సమయంలో ఇలాంటి రివ్యూలు కూడా చాలానే చూసాం.


 ఎవరు తుది జట్టులో చోటు సంపాదించుకుంటారు అన్నది కాదు ఇక వరల్డ్ కప్ లో పాల్గొన్న అన్ని జట్లల్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లతో ఒక జట్టు తయారు చేస్తే ఎలా ఉంటుంది అనే విషయంపై ఇటీవలే స్టార్ స్పోర్ట్స్ ఆలోచన చేసింది. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ లో పాల్గొన్న అన్ని జట్లలో మంచి ప్రదర్శన చేసిన ఆటగాళ్లని ఎంపిక చేసి ఇక తమ ప్లేయింగ్ ఎలెవన్ జట్టును తయారు చేసింది. ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.


 ఇకపోతే స్టార్ స్పోర్ట్స్ ఛానల్ ఇక ఓ టీం ని క్రియేట్ చేసి ఇక ఇదే టీమ్ ఆఫ్ ది టి20 వరల్డ్ కప్ టోర్నమెంట్ అంటూ సోషల్ మీడియాలో ప్రకటించింది. ఇక ఈ టీం కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది. ఇలా స్టార్ స్పోర్ట్స్ ఎంపిక చేసిన జట్టులో టీమ్ ఇండియా నుంచి ముగ్గురు ఆటగాళ్లకు చోటు దక్కడం గమనార్హం.


 కాగా స్టార్ స్పోర్ట్స్ ఛానల్ ప్రకటించిన టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ జట్టు వివరాలు ఇలా ఉన్నాయి..

 అలెక్స్ హేల్స్, జాస్ బట్లర్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, గ్లెన్ ఫిలిప్స్, సికిందర్ రాజా, షాదాబ్ ఖాన్, నోర్జే, సామ్ కరణ్, షాహిన్ ఆఫ్రిథి, అర్షదీప్ సింగ్ లను టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ గా స్టార్ స్పోర్ట్స్ ప్రకటించడం గమనార్హం. మరి స్టార్ స్పోర్ట్స్ ప్రకటించిన ఈ జట్టుపై మీ అభిప్రాయం ఏంటి..

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc