ఆస్ట్రేలియా వేదికగా జరిగిన వరల్డ్ కప్ లో  భాగంగా ఇటీవల ఇంగ్లాండ్ జట్టు ఫైనల్లో పాకిస్తాన్ పై గెలిచి ఇక టైటిల్ కైవసం చేసుకుంది అన్న విషయం తెలిసిందే. అంతేకాదు ఇక టి20 ఫార్మాట్లో ప్రపంచ క్రికెట్లో రెండోసారి వరల్డ్ కప్ ఫైనల్ గెలిచిన జట్టుగా రికార్డ్ సృష్టించింది అని చెప్పాలి. అయితే ఇక ఫైనల్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు ఎంతలా సంబరాలు చేసుకుందో అందరూ టీవీలో చూసే ఉంటారు.. ఏకంగా ఇంగ్లాండ్ కెప్టెన్ జాస్ బట్లర్ అయితే తన భార్య పిల్లలతో మైదానంలో వరల్డ్ కప్ చేతిలో పట్టుకొని సందడి చేశాడు.


 ఎంతో సంతోషంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు అని చెప్పాలి. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. సాధారణంగా ద్వైపాక్షిక సిరీస్ లు జరిగినప్పుడే గెలుపు ఓటములపై ఆయా జట్ల కెప్టెన్లు ఏం మాట్లాడబోతున్నారు అన్న విషయంపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటిది ఇక వరల్డ్ కప్ టైటిల్ గెలిచిన తర్వాత ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్ ఏం మాట్లాడబోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి.


 ఈ క్రమం లోనే ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్ తన జట్టు ఆటగాళ్ల ప్రదర్శన పై అంతే కాదు కోచింగ్ సిబ్బందిపై కూడా ప్రశంసలు కురిపించారు.. వరల్డ్ కప్ గెలవడం క్రెడిట్ మొత్తం వాళ్లకే దక్కుతుంది అంటూ వ్యాఖ్యానించాడు.  ముఖ్యం గా 2016 ప్రపంచ కప్ ఫైనల్లో ఓటమి తమను ఎంతో హర్ట్ చేసిందని.. ఈ విజయంతో దాన్ని మరిచిపోతామని చెప్పుకొచ్చాడు. అయితే ఆస్ట్రేలియా కోచింగ్ స్టాఫ్ తమ జట్టులో ఉండడమే బాగా కలిసి వచ్చిందని.. ఇక్కడ పరిస్థితులను అర్థం చేసినందుకు వారి సలహాలు ఉపయోగపడ్డాయి అంటూ చెప్పుకొచ్చాడు. ఇక రషీద్, బెన్ స్టోక్స్ పోరాటం అద్భుతం అంటూ ప్రశంసలు కురిపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc