దాదాపు గత నెల రోజుల నుంచి ఎంతో ఉత్కంఠ భరితంగా జరుగుతూ వచ్చిన టి20 వరల్డ్ కప్ ఎట్టకేలకు ముగిసింది. ఊహించని ఫలితాలతో.. అదిరిపోయే ట్విస్టులతో ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరికీ అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ పంచిన పొట్టి వరల్డ్ కప్ లో చివరికి దిగజ ఇంగ్లాండ్ జట్టు టైటిల్ గెలిచి విశ్వ విజేతగా నిలిచింది అని చెప్పాలి. అంతేకాదు టీ20 వరల్డ్ కప్ చరిత్రలో రెండవసారి కప్పు అందుకున్న జట్టుగా ఇంగ్లాండ్ చరిత్ర సృష్టించింది.


 అయితే ఇక పాకిస్తాన్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఫైనల్ పోరు ఎంతో ఉత్కంఠ భరితంగా సాగింది. ఎవరు విజయం సాధిస్తారు అన్న విషయం కూడా ఒకానొక దశలో అర్థం కాని విధంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ కేవలం ఇంగ్లాండ్ ముందు 138 పరుగుల స్వల్ప టార్గెట్ ఉంచినప్పటికీ.. ఆ తర్వాత పాకిస్తాన్ బౌలర్లు అద్వితీయమైన పోరాట పటిమ ఘనపరిచిన  తీరు మాత్రం అందరిని ఆకట్టుకుంది అని చెప్పాలి. ఇక చివరి వరకు బెన్ స్టోక్స్ అద్భుతమైన బ్యాటింగ్ తో   ఇక జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు మొత్తం ఆనందంలో మునిగిపోయింది అని చెప్పాలి.


 ఇకపోతే ఇటీవలే టి20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన ఇంగ్లాండ్ జట్టుకు ఎంత ప్రైజ్ మనీ అందింది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.. అయితే టైటిల్ విజేతగా నిలిచిన ఇంగ్లాండుకు 13 కోట్ల ఐదు లక్షల 35 వేల 440 రూపాయల ప్రైజ్ మనీ వచ్చిందట. ఇక రన్నరఫ్ గా నిలిచిన పాకిస్తాన్కు ఆరు కోట్ల 52 లక్షల 64,280  రూపాయలు వచ్చాయట. సెమీఫైనల్ కు వెళ్లిన భారత్,న్యూజిలాండ్ కు చెరో మూడు కోట్ల 26 లక్షల 20వేల రెండు వందల ఇరవై రూపాయలు వచ్చాయట. అయితే ఇక ఇటీవలే వరల్డ్ కప్ టైటిల్ గెలిచి ఇంగ్లాండ్ జట్టు అందుకున్న ప్రైజ్ మనీ మాత్రం అటు బీసీసీఐ నిర్వహించే  ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు ఇచ్చే ప్రైజ్ మనీ కంటే తక్కువ కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: