సినీ సెలబ్రిటీలతో పోల్చి చూస్తే క్రికెటర్లకు సోషల్ మీడియాలో కాస్త ఎక్కువగానే క్రేజ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఒక్కసారి అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన తర్వాత ఇక మంచి ప్రదర్శనతో బాగా గుర్తింపు సంపాదించుకున్నారు అంటే చాలు ఇక ఆ క్రికెటర్ గురించి ఏ విషయం సోషల్ మీడియాలోకి వచ్చిన అదే తెలుసుకోవడానికి నెటిజన్లు అందరూ ఆసక్తి చూపుతూ ఉంటారు  కొన్ని కొన్ని సార్లు ఇక వెతికి మరి ఎవరికీ తెలియని ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో గుర్తిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక క్రికెటర్లకు సంబంధించిన లవ్ స్టోరీ ల గురించి అయితే నేటిజన్స్ మరింత ఎక్కువగా తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు.



 అయితే ఇప్పటికే టీం ఇండియాలో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న వారి లవ్ స్టోరీ, ఇక పెళ్లి చేసుకున్న వారి మ్యారేజ్ లైఫ్ గురించి క్రికెట్ ప్రేక్షకులందరికీ అన్ని విషయాలు తెలుసు అని చెప్పాలి. అయితే ప్రస్తుతం టీమిండియాలో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న సంజు శాంసన్ లవ్ స్టోరీ గురించి మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అతని లవ్ స్టోరీ ఎక్కడ మొదలైంది. ఇక పెళ్లి వరకు ఎలా వెళ్ళింది అన్న విషయం కేవలం సన్నిహితులకు మాత్రమే తెలుసు. ఇకపోతే ఇటీవల అతని లవ్ స్టోరీ కి సంబంధించిన విషయాలు వైరల్ గా మారిపోయాయ్.


 ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగంగా సంజు శాంసన్ తన లవ్ మ్యారేజ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. తన భార్య చారులత, సంజు శాంసన్ తిరువనంతపురంలోని మార్ ఇవానియోస్ కాలేజీలో చదివారట. అయితే చారులత డిగ్రీ చదువుతున్న సమయంలో సంజు సాంసంగ్ ఇంగ్లీష్ లిటరేచర్ చదివాడట  ఇక ఓసారి సంజూ శాంసన్ చారులతకు ఫేస్బుక్లో రిక్వెస్ట్ పంపాడట. ఇక చారులత  కూడా అతని ఫ్రెండ్ రిక్వెస్ట్ ఓకే చేయగా కొన్ని రోజుల్లోనే వీరిద్దరూ ప్రేమికులుగా మారిపోయారు. ఇక ఇలా ఐదు సంవత్సరాలు ప్రేమలో మునిగితేలిన జంట 2018లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుని దాంపత్య బంధంలోకి అడుగుపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: