టి20 వరల్డ్ కప్ లో భాగంగా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన జట్లలో అటు పాకిస్తాన్ కూడా ఒకటి అని చెప్పాలి. అయితే వరల్డ్ కప్ లో అటు పాకిస్తాన్ జట్టుకు అదృష్టం బాగా కలిసి వచ్చింది. మోకాలి గాయం కారణంగా జట్టుకు దూరమైన స్టార్ ఫేసర్ షాహీన్ ఆఫ్రిది ఇక వరల్డ్ కప్ నాటికి కోలుకొని మళ్ళీ జట్టు లోకి వచ్చాడు.  అదే సమయంలో వరుసగా రెండు మ్యాచ్లలో ఓడిపోయి ఇంటిదారి పడుతుంది అనుకున్న పాకిస్తాన్ అదృష్టం కలిసి వచ్చి సెమి ఫైనల్ అడుగుపెట్టింది. ఇక సెమి ఫైనల్లో కూడా అటు న్యూజిలాండ్ ను ఓడించి ఫైనల్ కు చేరుకుంది.


 ఫైనల్లో మాత్రం పాకిస్తాన్ను దురదృష్టం వెంటాడింది అని చెప్పాలి. జట్టులో కీలక ఫేసర్ గా కొనసాగుతున్న షాహిన్ ఆఫ్రిది గాయం తిరగబెట్టింది. వరల్డ్ కప్ ముందు వరకు అతను బాధపడిన  మోకాలి గాయం నుంచి కోలుకున్నాడు అన్న సంతోషం అభిమానులకు లేకుండా పోయింది. మరోసారి ఫైనల్ మ్యాచ్లో  మోకాలి గాయం తిరగబెట్టడంతో ఇక అతను బౌలింగ్ చేయలేక చివరికి మైదానం వీడి వెళ్ళిపోయాడు. అయితే కీలక సమయంలో షాహిద్ ఆఫ్రిది లాంటి బౌలర్ లేకపోవడంతో ఇక పాకిస్తాన్ జట్టు రెగ్యులర్ బౌలర్ కాక పోయినప్పటికీ ఇఫ్తీకర్ బౌలింగ్ చేయించాల్సి వచ్చింది. ఇదే పాకిస్తాన్ ఓటమిని శాసించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 అయితే ఇటీవలే మేల్ బోర్న్ వేదికగా జరిగిన వరల్డ్కప్ లో ఓడిపోయి నిరాశలో మునిగిపోయిన పాకిస్తాన్ జట్టుకు మరో ఊహించని షాక్ తగిలింది. ఫైనల్ మ్యాచ్లో మోకాలి గాయంతో మైదానాన్ని వీడిన షాహిన్ ఆఫ్రిది కోలుకోవడానికి ఆరు నెలల సమయం పడుతుందట. తద్వారా వచ్చే నెల నుంచి స్వదేశంలో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ తో జరగబోయే వరుస సిరీస్ లకు షాహిన్ ఆఫ్రిది దూరం కాబోతున్నాడు అనేది తెలుస్తుంది. కాగా వచ్చే నెలలో  ఇంగ్లాండ్ తో సిరీస్ నేపథ్యంలో షాహిన్  స్థానంలో ఇక హరీష్ రావుఫ్ టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: