గత కొన్ని సీజన్స్ నుంచి సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయాలు అభిమానులు అందరిని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే జట్టులో కీలక ఆటగాళ్లుగా కొనసాగుతున్న వారిని పక్కన పెట్టి కొత్త ఆటగాళ్లను తీసుకుంటూ ఉంది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం.  గతంలో ఏకంగా సన్రైజర్స్ కి ఒకసారి కెప్టెన్ గా టైటిల్ అందించిన గొప్ప ఆటగాడు డేవిడ్ వార్నర్ విషయంలో షాకింగ్ డెసిషన్ తీసుకుంది. అతన్ని జట్టు నుంచి పక్కన పెట్టడమే కాదు మెగా వేలం సమయంలో అతని పూర్తిగా వదిలేసుకోవడం గమనార్హం.


 ఇలా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం వార్నర్ ను వదిలేసుకోవడంతో అందరూ షాక్ అయ్యారు. ఇక ఇప్పుడు మరొకసారి అభిమానులందరినీ కూడా అవాక్కయ్యేలా చేసే మరో షాకింగ్ డెసిషన్ తీసుకుంది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం. ఏకంగా సన్రైజర్స్ జట్టు కి కెప్టెన్గా కొనసాగుతున్న విలియమ్సన్ ను  జట్టు నుంచి వదులుకునేందుకు సిద్ధమైంది అని చెప్పాలి. ప్రస్తుతం ప్రపంచంలోనే బెస్ట్ కెప్టెన్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు విలియమ్సన్. అదే సమయంలో ఇటీవలే వరల్డ్ కప్ లో మంచి ప్రదర్శన కూడా చేశాడు. అలాంటి కేన్ విలియమ్సన్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం వదులుకుంది.


 అన్ని జట్లు కూడా తాము వదులుకునే ఆటగాళ్ల వివరాలను ప్రకటించాలి అంటూ బీసీసీఐ కి ఆదేశాలు జారీ చేయగా కేన్ విలియమ్సన్ ను వదులుకుంటున్నట్లు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం తెలిపింది. విలియమ్సన్ తోపాటు పవర్ హిట్టర్ గా పేరున్న నికోలస్ పూరన్ ను కూడా సన్రైజర్స్ వదిలేసింది.. మార్కరం, త్రిపాటి, ఫిలిప్స్, సమద్, అభిషేక్ జాన్సన్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, పారుకి, త్యాగి, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్ లను  రిటైన్ చేసుకుంది. అయితే వరల్డ్ లోనే బెస్ట్ కెప్టెన్ లలో ఒకడిగా ఉన్న కేన్ విలియమ్సన్ ను  సన్రైజర్స్ వదులుకోవడం ఏంటి అని అందరూ అవాక్కైతున్నారు . ఈ నిర్ణయం పై సన్రైజర్స్ మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: