ఇటీవల టి20 వరల్డ్ కప్ ఫైనల్లో భాగంగా పాకిస్తాన్ , ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయి కేవలం రన్నరప్ గా మాత్రమే సరిపెట్టుకుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఫైనల్లో ఓటమిని ఆ జట్టు అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఓటమికి గల కారణాలను తెరమీదకి తీసుకువస్తూ ఏకంగా జట్టులోని ఆటగాళ్లపై, కెప్టెన్ బాబర్ అజాంపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నారు. మాజీ ఆటగాళ్లు సైతం పాకిస్తాన్ ఓటమిపై కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు అన్న విషయం తెలిసిందే.


 ఇకపోతే ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోవడానికి గల కారణం ఏంటి అనే విషయంపై ఇటీవల పాకిస్తాన్ మాజీ ఆటగాడు సల్మాన్ బట్ కూడా స్పందించాడు. అటు కెప్టెన్ బాబర్ అజం చేసిన ఒక పెద్ద తప్పిదం కారణంగానే పాకిస్తాన్ ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు. లేదంటే పాకిస్తాన్ గెలిచేది అంటూ సల్మాన్ భట్ చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయాయ్. ఇటీవల తన యూట్యూబ్ ఛానల్ వేదికగా మాట్లాడుతూ ఫైనల్ మ్యాచ్లో షాహిన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఆరంభంలోనే ఫామ్ లో ఉన్న అలెక్స్ హేల్స్ వికెట్ పడగొట్టాడు. అలాంటి షాహీన్ ఆఫ్రిథితో పవర్ ప్లేలో ఐదో ఓవర్ ఎందుకు వేయించలేదో ఇప్పటికీ నాకు అర్థం కాలేదు.



 అంతేకాకుండా మైదానంలో బంతి ఎంతో అద్భుతంగా స్వింగ్ అవుతుంది. ఇలాంటి సమయంలో  నసీం షాతో వరుస ఓవర్లు వేయించాల్సింది. ఎందుకంటే స్వింగ్ తో పాటు అటు ఇంగ్లాండ్ ఒత్తిడిలో ఉంది కాబట్టి వికెట్లు పడే అవకాశం ఉండేది. కానీ అప్పుడు బాబర్ షాదాబ్ తో బౌలింగ్ చేయించాడు. ఈ నిర్ణయం ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ లపై ఎలాంటి ప్రభావం చూపలేదు. ఇక షాహిన్  సెకండ్ స్పెల్ కోటాను గాయం కారణంగా పూర్తి చేయలేకపోయాడు. బెన్ స్టోక్స్ క్రీజ్ లో ఉన్నప్పుడు ఇఫ్తికర్ ను బాబర్ తీసుకొచ్చాడు. అక్కడే బాబర్ పెద్ద తప్పు చేశాడు. జట్టు ప్రధాన బౌలర్ మహమ్మద్ నవాజ్ తో బౌలింగ్ చేయించాల్సింది. ఇక ఇఫ్తికర్ బౌలింగ్ తోనే ఒకసారిగా మ్యాచ్ ఇంగ్లాండ్ వైపు టర్న్ అయింది అంటూ సల్మాన్ బట్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: