గత కొంతకాలం నుంచి టీమ్ ఇండియాలో జరుగుతున్న మార్పులు అందరికీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు . ఒకవైపు టీమ్ ఇండియా వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లతో బిజీబిజీగా గడుపుతుంది. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా ఇక ఏ సిరీస్ లో ఎవరికి విశ్రాంతి ప్రకటిస్తారు అన్నది ఊహించని విధంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఒకప్పుడు విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఉన్న సమయంలో ఇక మూడు ఫార్మాట్లకు కూడా విరాట్ కోహ్లీనే కెప్టెన్ గా ఎప్పుడు అందుబాటులో ఉండేవాడు. కానీ ఎప్పుడైతే రోహిత్ శర్మ చేతికి కెప్టెన్సీ పగ్గాలు వచ్చాయో ఇప్పటివరకు రోహిత్ ఎన్నడూ కూడా మూడు ఫార్మాట్లకు అందుబాటులో ఉన్నది లేదు.


 ఒక ద్వైపాక్షిక సిరీస్ ముగిసిందో లేదో రోహిత్ శర్మకు విశ్రాంతి ప్రకటిస్తూ ఇక టీమిండియా కు కొత్త గా తాత్కాలిక కెప్టెన్ నియమించడం లాంటివి చేస్తూ వస్తుంది బీసీసీఐ. అయితే యువ ఆటగాళ్లు అందరికీ అవకాశం ఇవ్వడానికే ఇలాంటివి చేస్తున్నాము అని చెబుతున్న అటు బీసీసీఐ తీసుకున్న నిర్ణయాలు మాత్రం అందరిని అవాక్కేలా చేస్తూ ఉన్నాయ్. ఇక ఇటీవల వరల్డ్ కప్ లో టీమిండియా నిరాశపరిచింది. కాగా వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ప్రస్తుతం టీమిండియా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్ళింది. ఇక ఈ పర్యటనలో ఎప్పటిలాగానే రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ విరాట్ కోహ్లీ లాంటి కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ప్రకటించింది బీసీసీఐ.


 కానీ ఎన్నడూ లేని విధంగా ఏకంగా న్యూజిలాండ్ సిరీస్ కు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ బౌలింగ్, బ్యాటింగ్ కోచ్ లకి కూడా విశ్రాంతి కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారిపోయింది. ఇక ఇటీవల ఇదే విషయంపై స్పందించిన టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి అటు బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టాడు. కోచ్లకు బ్రేక్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి అంటూ ప్రశ్నించాడు. ఐపీఎల్ సమయంలో రెండు నుంచి మూడు నెలల వరకు వారికి విశ్రాంతి లభిస్తుంది. అది సరిపోతుంది. కానీ ప్రత్యేకంగా వారికి విశ్రాంతి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆటగాళ్లను అర్థం చేసుకొని జట్టును గాడిలో పెట్టాలి అంటే కోచ్ లు ఆటగాళ్లతో ఎక్కువ సమయం గడపాలి అంటూ రవి శాస్త్రి చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: