2023 ఐపీఎల్ సీజన్ కు సంబంధించి ఇప్పుడు నుంచి సన్నహాలు మొదలుపెట్టింది బీసీసీఐ. ఈ క్రమంలోనే అన్ని రకాల ప్రక్రియలను పూర్తి చేసే పనిలో పడింది బీసీసీఐ. ఈ క్రమంలోనే ఇటీవల రీటెన్షన్ ప్రక్రియను పూర్తి చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఈ క్రమంలోనే ఇటీవలే ఐపిఎల్ ఫ్రాంచైజీలు అన్నీ కూడా 2023 ఐపీఎల్ సీజన్ కోసం తమతో అంటిపెట్టుకోవాలి అనుకున్న ఆటగాళ్ల వివరాలతో పాటు వేలంలోకి వదిలేయాలి అనుకుంటున్నా ఆటగాళ్ల వివరాలను కూడా ప్రకటించాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది.


 కాగా బిసిసిఐ ఆదేశాలు జారీ చేసిన మేరకు ఇక అన్ని జట్లు కూడా ఆ వివరాలను ప్రకటించాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే అటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ ఏకంగా 13 మంది ఆటగాళ్లను వదులుకుంటూ నిర్ణయం తీసుకుంది అని చెప్పాలి. ఇది కాస్త ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది. ఇక ఇందులో ఎంతో మంది యువ ఆటకాళ్లు ఉండడం గమనార్హం. అదే సమయంలో ఇక తమతో అంటిపెట్టుకున్న ఆటగాళ్ల వివరాలను కూడా ప్రకటించింది ముంబై ఇండియన్స్. ఇక్కడే ఒక విషయం అందరినీ ఆలోచనలో పడేసింది.


 ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ భారత మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఏకంగా రిటైన్ చేసుకుంటున్నట్లు ప్రకటించింది ముంబై ఇండియన్స్. అదేంటి అర్జున్ టెండూల్కర్ కి ఒక్కసారి కూడా అటు తుది జట్టులో స్థానం కల్పించలేదు  దానికి తోడు అతను ఎక్కడ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. అలాంటిది మిగతా ఆటగాళ్లను వదిలేసి అతన్ని ఇంకా ఎందుకు ముంబై ఇండియన్స్ తమతోనే పెట్టుకుంది అన్న ప్రశ్న మొదలైంది. ఇలాంటి సమయంలోనే కేవలం సచిన్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ కు చేసిన సేవలను గౌరవిస్తూ  ఇక ఇప్పుడు అతని తనయుడు అర్జున్ టెండూల్కర్ ను తమతోపాటే ముంబై ఇండియన్స్ ఉంచుకుంది అనేది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: