గత కొన్ని రోజుల నుంచి కాస్తయినా గ్యాప్ లేకుండా టీమిండియా వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లు ఆడుతూ ఉంది. ఇలాంటి సమయంలోనే ఇక జట్టులో ఉన్న కీలక ఆటగాళ్లు అందరికీ కూడా వరుసగా విశ్రాంతి ప్రకటిస్తూ బీసీసీఐ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు మొన్నటికి మొన్న ఆస్ట్రేలియాలో వరల్డ్ కప్ ముగిసిన తర్వాత టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా ఉన్న రాహుల్ ద్రావిడ్ కి మిగతా కోచింగ్ సిబ్బందికి కూడా విశ్రాంతి ఇస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఇక ప్రస్తుతం భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లగా తాత్కాలిక హెడ్ కోచ్ బాధ్యతలను నేషనల్ క్రికెట్ అకాడమీ చైర్మన్గా ఉన్న వివిఎస్ లక్ష్మణ్ కు అప్పగించింది.


 అయితే ఇటీవలే హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్  కు విశ్రాంతి ప్రకటిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకోవాడాన్ని మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి తప్పుపట్టాడు. కోచ్ అంటేనే ఎక్కువ సమయం పాటు ఆటగాళ్లతో గలపాలి. అలాంటిది ఇక కోచ్ కి విశ్రాంతి ఇవ్వడం ఏంటి అంటూ బీసీసీఐని ప్రశ్నించాడు.. ఇలా హెడ్ కోచ్ కి విశ్రాంతి ప్రకటించడం కారణంగా అటు ఆటగాళ్లు ఇద్దరు కోచ్ లతో  కన్ఫ్యూజన్ లో పడే అవకాశం ఉందని.. ఇక ఎవరి వ్యూహాలను ఫాలో అవ్వాలో తెలియక చివరికి ఆటను చెడగొట్టుకుంటారంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయితే ఇటీవల  ఇదే విషయంపై స్పందించిన రవిచంద్రన్ అశ్విన్ రవిశాస్త్రికి కౌంటర్ ఇచ్చాడు.


 విరామం లేకుండా పనిచేసినప్పుడు ఎవరైనా సరే మానసికంగా శారీరకంగా అలసిపోతారని అశ్విన్ వెల్లడించారు. పూర్తి బిన్నమైన జట్టుతో వివిఎస్ లక్ష్మణ్ న్యూజిలాండ్ కు ఎందుకు వెళ్ళాడో నేను వివరిస్తాను. ఎందుకంటే దానిని మరో కోణంలో చూస్తున్నారు అందరు. టి20 ప్రపంచ కప్ ముందు రాహుల్ ద్రావిడ్ జట్టు విపరీతంగా శ్రమించింది. ప్లానింగ్ నుంచి చివరి వరకు నేను అంతా గమనించాను. అందుకే ఇదంతా చెబుతున్న ప్రతి వేదిక ప్రత్యేక కోసం, ప్రత్యర్థి  జట్టు కోసం ప్రత్యేకమైన ప్రణాళికలు ఉన్నాయి. ఇది శారీరకంగానే కాదు మానసికంగా అలసటకు దారితీస్తుంది. అందరికీ విరామం అవసరం. న్యూజిలాండ్ పర్యటన ముగియగానే మాకు బంగ్లాదేశ్ పర్యటన ఉంది. అందుకే రాహుల్ ద్రవిడ్ కి విశ్రాంతి ప్రకటించారు అంటూ అశ్విన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: