సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ కు తిరుగులేదు అన్న విషయం మరోసారి ఇటీవలే నిరూపితం అయింది. న్యూజిలాండ్ తో జరిగిన రెండవ టి20 మ్యాచ్ లో భాగంగా సూర్యకుమార్ బ్యాటింగ్ విధ్వంసం మరోసారి కొనసాగింది. ఈ క్రమంలోనే తన అద్భుతమైన బ్యాటింగ్ తీరుతో వరుసగా రికార్డులను కొల్లగొడుతూనే ఉన్నాడు ఈ ఆటగాడు. ఇటీవల 51 బంతుల్లో ఏకంగా 111 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్ అదరగొట్టాడు అని చెప్పాలి. ఈ మ్యాచ్ లో 65 పరుగులు తేడాతో టీమిండియా విజయం సాధించింది.

అయితే ఇటీవల సాధించిన వీరోచితమైన సెంచరీ తో సూర్యకుమార్ ఎన్నో రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

 ఒకే క్యాలెండరు ఇయర్లో రెండు సెంచరీలు సాధించిన రెండో టీమిండియా బ్యాట్స్మన్ గా రికార్డు సృష్టించడం అంతకు ముందు ఈ రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉండేది.

 న్యూజిలాండ్ గడ్డపై టి20 లలో శతకం సాధించిన తొలి భారత భారత ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు.

 అంతర్జాతీయ టి20 లో ఒకే క్యాలెండరులో అత్యధిక 50 ప్లస్ సాధించిన రెండో ప్లేయర్గా మరో రికార్డు ఖాతాలో వేసుకున్నాడు.

 అంతర్జాతీయ టి20 లలో  టీమ్ ఇండియా తరఫున అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్ మెన్ గా కేఎల్ రాహుల్ రెండు సెంచరీల రికార్డును సమం చేశాడు.

 సూర్య మొదటి సెంచరీ ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ గడ్డపై చేయగా.. ఇక ఇప్పుడు న్యూజిలాండ్ గడ్డపై మరో సెంచరీ చేశాడు. ఇలా విదేశీ గడ్డపై వరుసగా రెండు శతకాలు చేసిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. ఇలా ఒక సెంచరీ తో ఎన్నో అరుదైన రికార్డులు సృష్టించాడు.

 ఇకపోతే సూర్యకుమార్ అద్భుతమైన ఇన్నింగ్స్ కారణంగానే అటు భారత జట్టు భారీ స్కోర్ చేయగలిగింది అని చెప్పాలి. ఇప్పుడు వరకు తన టి20 కెరియర్ లో 39 ఇన్నింగ్స్ లలో  181 స్ట్రైక్ రేట్ తో 1395 పరుగులు చేశాడు సూర్య. ఇందులో రెండు సెంచరీలతో పాటు 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: