2023 ఐపీఎల్ సీజన్లో కప్పు కొట్టడమే లక్ష్యంగా ప్రస్తుతం అన్ని జట్లు కూడా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయ్ అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల రిటెన్షన్ ప్రక్రియను కూడా పూర్తి చేశాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే కొన్ని జట్లు అయితే రికార్డు స్థాయిలో భారీగానే ఆటగాళ్లను వదులుకునేందుకు సిద్ధమయ్యాయి. ఇక ఇలా ఎక్కువ మంది ఆటగాళ్లను వదులుకున్న లిస్టులో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కూడా ఉంది అని చెప్పాలి. కేవలం 12 మంది ఆటగాళ్ళను మాత్రమే రిటైన్ చేసుకున్న ఆ జట్టు మిగతా అందరిని కూడా వదిలేసింది.


 ఇలా వదిలేసుకున్న ఆటగాళ్ల లో ఏకంగా జట్టు కెప్టెన్ గా ఉన్న కేన్ విలియమ్సన్  కూడా ఉండడం గమనార్హం. అయితే ఏకంగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ సహా స్టార్ బ్యాట్స్మెన్ ఏకంగా పూరన్ లాంటి ఆటగాళ్లను కూడా వదులుకోవడంతో ఇక ఇప్పుడు ఎవరిని జట్టులోకి తీసుకోబోతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. ప్రస్తుతం సన్రైజర్స్ హైదరాబాద్ దగ్గర 42.25 కోట్ల పర్స్ మనీ ఉంది. దీంతో ఈ మొత్తాన్ని ఎవరి కోసం వెచ్చించబోతుంది అన్నదానిపైనే అందరి దృష్టి ఉంది.


 అయితే కెప్టెన్ గా కేన్ విలియమ్స్ ను వదిలేసుకున్న నేపథ్యం లో ఇక ఇప్పుడు ఒక స్టార్ ప్లేయర్ పై సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం కన్నేసింది అన్నది తెలుస్తుంది.. ఇటీవల టి20 వరల్డ్ కప్ లో భాగం గా సత్తా చాటిన బెన్ స్టోక్స్ లాంటి ఆటగాళ్లపై సన్రైజర్స్ కనపడినట్లు తెలుస్తుంది. ముఖ్యం గా బెన్ స్టోక్స్ ని తీసుకోవాలని గట్టిగా ఫిక్స్ అయిందట. అతన్ని జట్టులోకి తీసుకోవడం వల్ల ఒకవైపు జట్టుకు అసలు సిసలైన ఆల్రౌండ్ దొరికినట్లు అవుతుంది. మరోవైపు అతనికి కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పగించాలని ఇక జట్టు యాజమాన్యం భావిస్తుందట. ఏం జరగబోతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: