ప్రస్తుతం ఇండియాలో దేశవాళీ వన్ డే లీగ్ విజయ్ హజారే ట్రోఫీ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ లీగ్ లో మొత్తం 38 జట్లు అయిదు గ్రూప్ లుగా విడిపోయి టైటిల్ కోసం పోరాడుతున్నారు. ఈ లీగ్ లో మంచి ప్రదర్శన కనబరిచిన కుర్రాళ్ళు ఐపీఎల్ కు మరియు మెయిన్ ఇండియన్ టీం కు కూడా సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయన్న విషయం తెలిసిందే. అందుకే ముఖ్యంగా కుర్రాళ్ళు అందివచ్చిన ఈ అవకాశాన్ని రెండు చేతులా సద్వినియోగం చేసుకుంటున్నారు.  ఈ టోర్నీలో ఈ రోజు కాసేపటి క్రితమే వరల్డ్ రికార్డ్ బద్దలు అయింది. తమిళనాడు మరియు అరుణాచల్ ప్రదేశ్ జట్ల మధ్యన బెంగళూరు వేదికగా మ్యాచ్ జరుగుతోంది.

మొదట టాస్ గెలిచిన అరుణాచల్ ప్రదేశ్ తమిళనాడుకు బ్యాటింగ్ అప్పగించింది. ఈ సిరీస్ లో అద్భుతంగా రాణిస్తున్న తమిళనాడు ఓపెనర్లు నారాయణ జగదీశన్ మరియు సాయి సుదర్శన్ లు మరోసారి అద్బుతమయిన మొదటి వికెట్ కు భాగస్వామ్యం అందించారు. వీరిద్దరూ మొదటి వికెట్ కు 416 పరుగులు జోడించారు. సాయి సుదర్శన్ 154 పరుగులు చేసి అవుట్ అవ్వగా, నారాయణ్ జగదీశన్ 277 పరుగులు చేసి కొంచెంలో ట్రిపుల్ సెంచరీ చేసే అవకాశాన్ని వదులుకున్నాడు. ఇతని ఇన్నింగ్స్ లో మొత్తం 25 ఫోర్లు మరియు 15 సిక్సర్లు ఉన్నాయి.

 ఈ క్రమంలో జగదీశన్ వరల్డ్ రికార్డ్ ను వడ్డలు కొట్టాడు, ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అత్యధిక పరుగుల రికార్డును అధిగమించాడు. ఇంతకు ముందు ఈ రికార్డ్ ఏ డి బ్రౌన్ 268 పరుగులు మరియు రోహిత్ శర్మ 264 పరుగులు చేసి ముందు ఉన్నారు. ఇప్పుడు జగదీశన్ వరల్డ్ రికార్డ్ తో టాప్ లో ఉన్నాడు. మాములుగా జగదీశ్ ఈ స్థాయిలో ఎప్పుడూ చెలరేగి ఆడింది లేదు. ఈ సీజన్ లో ఇది అతనికి అయిదవ సెంచరీ కావడం విశేషం.  




మరింత సమాచారం తెలుసుకోండి: