
ఇలా తమిళనాడు అరుణాచల్ ప్రదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో తమిళనాడు జట్టు ఎంత అద్భుతమైన ప్రదర్శన చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళనాడు జట్టులోని బ్యాట్స్మెన్లు జగదీషన్ అండ్ 277, సాయి సుదర్శన్ 154 అపరాజీత్ 31, ఇంద్రజిత్తు 31 పరుగులు చేశారు. తద్వారా ఇక నిర్ణీత 50 ఓవర్లలో తమిళనాడు జట్టు ఏకంగా 506 పరుగులు చేసింది. అయితే ఇలా భారీ పరుగులు చేయడం ద్వారా విజయ హజారే ట్రోఫీలో మాత్రమే కాదు. లిస్ట్ ఏ క్రికెట్లో కూడా తమిళనాడు జట్టు ఒక అరుదైన రికార్డు సృష్టించింది అని చెప్పటంలో అతిశయోక్తి లేదు.
ఇంతకీ తమిళనాడు జట్టు సృష్టించిన రికార్డు ఏంటి అంటే.. లిస్ట్ ఏ క్రికెట్లో భాగంగా అత్యధిక స్కోరు నమోదు చేసింది. ఇటీవలే అరుణాచల్ ప్రదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 50 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టానికి 56 పరుగులు చేసింది. అయితే ఇప్పుడు వరకు భారత క్రికెట్లో మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్ లో కూడా అటు లిఫ్ట్ ఏ స్టేజ్ లో ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. అంతకుముందు ఇంగ్లాండ్ 498/6, సర్రే 496/4, ఇంగ్లాండ్ 481/4, భారత్ 458/4 మాత్రమే లిఫ్ట్ ఏ క్రికెట్లో అత్యధిక పరుగులుగా ఉండగా ఇక ఇటీవల తమిళనాడు సరికొత్త చరిత్ర సృష్టించాను.