ఇప్పటికే  ఐపీఎల్ లో  కెప్టెన్గా మంచి గుర్తింపు సంపాదించుకున్న హార్దిక్ పాండ్యా ఇక ప్రస్తుతం అప్పుడప్పుడు టీమిండియా కు తాత్కాలిక కెప్టెన్గా కూడా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా ఉన్న సమయంలో అతడు తీసుకున్న నిర్ణయాలు కొన్ని కొన్ని సార్లు అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మొన్నటికి మొన్న రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రపంచ కప్ లో దీపక్ హుడా జట్టులో ఉన్నప్పటికీ అతని తుదిజట్టులో మాత్రం అవకాశాలు కల్పించలేదు.


 ఒకసారి కూడా బౌలింగ్ వేసేందుకు ఛాన్స్ ఇవ్వలేదు. కానీ ఇటీవలే న్యూజిలాండ్ తో జరిగిన రెండవ టి20 లో మాత్రం  పాండ్యా ఏకంగా దీపక్ హుడా చేతికి బంతిని అప్పగించాడు. దీంతో అతను వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అద్భుతం చేసి చూపించాడు. 2.5 ఓవర్లలో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన నాలుగు వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్ ను దెబ్బ కొట్టాడు. ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యా తీసుకున్న నిర్ణయం ముందుగా అందరినీ ఆశ్చర్యపరిచినప్పటికీ ఆ తర్వాత వచ్చిన ఫలితం చూసి అందరూ అవాక్కయ్యారు. ఇక అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.


 ఈ క్రమంలోనే ఇలా అద్భుతం నిర్ణయం తీసుకున్న హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ పై మాజీ ఆటగాళ్లు పార్థివ్ పటేల్ ప్రశంసల కురిపించాడు. బౌలింగ్ చేయగల సామర్థ్యం ఉన్న ఆటగాడిని గుర్తించడం అంతర్జాతీయ క్రికెట్లో ఎంతో ముఖ్యం. అలాంటి వారికి బౌలింగ్ ఇవ్వాలి. దీపక్ హుడా విషయంలో హార్థిక్ పాండ్యా తీసుకున్న నిర్ణయం ఎంతో తెలివైనది. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ చేయగల సత్తా దీపక్ హుడాకు ఉంది. అతనికి ప్రపంచ కప్ లో కూడా చోటు దక్కింది. అయితే అక్కడ ఆడిన ఒక్క గేమ్ లోను బౌలింగ్ చేయలేదు. అయితే అతనికి పూర్తి ఓవర్లు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. అతని సత్తా నిరూపించుకునేందుకు  ఒక్క ఓవర్ల్లో అయినా ఛాన్స్ ఇవ్వాలి అంటూ పార్థివ్ పటేల్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: