విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ఇటీవల తమిళనాడు చరిత్రసృష్టించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఎన్నో రికార్డులను సృష్టించి భారత క్రికెట్లో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ముఖ్యంగా తమిళనాడు ఆటగాడు జగదీషన్ ఏకంగా 277 పరుగులతో చెలరేగిపోయి అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. మరోవైపు తమిళనాడు జట్టు 506 పరుగులు చేసి విజయ హజారే ట్రోఫీలోనే కాదు అటు ప్రపంచ క్రికెట్ లో ఏ లిస్టు స్టేజిలో అత్యధిక పరుగులు నమోదు చేసిన జట్టుగా నిలిచింది.


 మరోవైపు అరుణాచల్ ప్రదేశ్ ను 73 పరుగులకే ఆల్ అవుట్ చేయడంతో 425 పరుగుల తేడాతో విజయం సాధించి అత్యధిక పరుగులు తేడాతో విజయం సాధించిన జట్టుగా కూడా తమిళనాడు ప్రపంచ రికార్డుసృష్టించింది అని చెప్పాలి. ఇకపోతే తమిళనాడు జట్టు ప్రదర్శన పై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవల ఇదే విషయంపై స్పందించిన టీమ్ ఇండియా వెటరన్ ప్లేయర్ దినేష్ కార్తీక్ సైతం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 జగదీషన్ అద్భుతంగా ఆడాడు. అలాగే వరుసగా ఐదు సెంచరీలు సాధించాడు. ప్రపంచ రికార్డు సృష్టించినందుకు అతనికి శుభాకాంక్షలు. ఇక సాయి సుదర్శన్ కూడా కీలకపాత్ర పాత్ర వహించాడు. వీరిద్దరి ఓపెనింగ్ జోడి ప్రత్యర్ధులలో వణుకు పుట్టిస్తుంది అంటూ ప్రశంసించాడు  అయితే మరో కీలక విషయం చెప్పాలనుకుంటున్న అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు దినేష్ కార్తీక్.  ఈశాన్య జట్టును అత్యుత్తమ టీమ్లతో కూడిన లీగ్ దశలో ఆడించడంలో అర్థం ఉందా. ఇది కేవలం రన్ రేట్ల కోసమే ఆడుతున్నట్లుగా ఉంది. ఇలాంటి జట్లతో ఆడేటప్పుడు వర్షం పడి రద్దు అయితే ఇతర జట్ల పరిస్థితి ఏంటి. నాణ్యత పరంగా ఇలాంటి జట్లకు ప్రత్యేకంగా గ్రూపు ఏర్పాటు చేసి క్వాలిఫైర్ మ్యాచ్లను ఆడిస్తే ఏమవుతుంది అంటూ దినేష్ కార్తీక్ సూటిగా ప్రశ్నించాడు. కాగా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఒక్కో జట్టును వివిధ గ్రూపులో ఉంచగా ఇప్పటివరకు జట్లు ఒక్క విజయాన్ని కూడా సాధించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: