గత కొంతకాలం నుంచి బీసీసీఐ యాజమాన్యం కొంతమంది ఆటకాళ్ల విషయంలో వివక్షపూరితంగా  వ్యవహరిస్తుందా అంటే ప్రతి ఒక్కరు కూడా అవును అనే సమాధానం చెబుతున్నారు. ఎందుకంటే పేలపమైన  ప్రదర్శన చేస్తున్న ఆటగాళ్లకు వరుసగా అవకాశాలు ఇస్తున్న బీసీసీఐ.. వచ్చిన అడపాదడపా అవకాశాలలోనే మంచి ప్రదర్శన చేస్తూ అందరిని ఆకట్టుకుంటున్న ఆటగాళ్లని మాత్రం టీమిండియాలోకి సెలక్ట్ చేయకపోవడం.. ఒకవేళ సెలెక్ట్ చేసిన కేవలం బెంచ్ స్ట్రెంత్ కి మాత్రమే పరిమితం చేస్తున్నారు.


 ఇలా గత కొంతకాలం నుంచి టీమిండియా తుదిజట్టులో అవకాశం దక్కించుకోలేకపోతున్న ఆటగాళ్లలో యువ ఆటగాడు సంజు శాంసన్ ఉన్నాడు అని చెప్పాలీ. మొన్నటికి మొన్న ముగిసిన ఐపిఎల్ లో ఇతను అద్భుతమైన ప్రదర్శన చేశాడు.  టీమ్ ఇండియా తరఫున దక్కిన అడపాదడప అవకాశాల్లో కూడా రానించాడు. అయినప్పటికీ అతని స్థానం మాత్రం సుస్థిరం కావడం లేదు. ఇక ఇటీవల న్యూజిలాండ్ పర్యటన లో టి20 సిరీస్ లో సంజు శాంసన్ ఎంపికయ్యాడు.


 రెండవ టి20 మ్యాచ్ లో అతను తుది జట్టు లో కనిపించ లేదు. కనీసం మూడో టి20 మ్యాచ్ లో అయినా అతనికి  చోటు దక్కుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ అభిమానులకు నిరాశ మిగిలింది  అన్న విషయం తెలిసిందే. దీంతో బీసీసీఐ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు ఎంతో మంది క్రికెట్ అభిమానులు. కాగా ఇదే విషయంపై స్పందించిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా సమాధానం ఇచ్చాడు. ఇది నా టీం.. జట్టుకు సరి పోయే ప్లేయర్లను కోచ్ తో కలిసి నేనే ఎంపిక చేస్తాను. ఇంకా చాలా టైం ఉంది. అందరికీ అవకాశాలు వస్తాయి. ఒకసారి జట్టు లోకి వస్తే ఎక్కువ కాలం కొనసాగుతారు. విమర్శలను నేను అస్సలు పట్టించుకోను. జట్టును మధ్యలో విభజించి మార్పులు చేయడం అసలు మంచిది కాదు అంటూ హార్దిక్ సమాధానం ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: