గత కొన్ని రోజుల నుంచి దేశవాళి క్రికెట్లో అద్భుతమైన ప్రస్తానాన్ని కొనసాగిస్తూ ఇక సెంచరీలతో చెలరేగిపోతున్న ఆటగాడు ఎవరైనా ఉన్నారు అంటే ముందుగా వినిపించే పేరు సర్పరాజ్ ఖాన్. దేశీయ క్రికెట్లో అభినవ బ్రాడ్మన్ గా అభిమానులు అందరూ పిలుచుకునే సర్పరాజ్ ఖాన్ ఏకంగా సెంచరీలతో చదిరేగిపోయే తీరు అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంది అని చెప్పాలి. దేశవాళి క్రికెట్లో రన్ మిషన్ గా పేరు సంపాదించుకున్న ఈ ముంబై క్రికెటర్ ఇక ఇటీవల తన ఖాతాలో మరో సెంచరీ వేసుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ఇటీవల జరిగిన మ్యాచ్లో మరో అద్భుతమైన సెంచరీ సాధించి అదరగొట్టాడు.



 ఇటీవలే రైల్వేస్ తో జరిగిన మ్యాచ్లో శతకం సాధించి జట్టును గెలిపించాడు సర్పరాజ్ ఖాన్. అయితే ఈ మ్యాచ్ లో భాగంగా తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది రైల్వేస్ జట్టు. ఈ క్రమంలోనే నిర్ణీత  50 ఓవర్లు ఐదు వికెట్ల నష్టానికి  337 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ తర్వాత లక్ష్య చేదనకు దిగిన ముంబై జట్టులో  సర్పరాజ్ ఖాన్ అద్భుతమైన సెంచరీ చేశాడు. 94 బంతుల్లోనే 117 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఇందులో 10 ఫోర్లు ఐదు సిక్సర్లు ఉన్నాయి.  కెప్టెన్ అజంక్యరహన 82 బంతుల్లో 88,  పృథ్విశా 47 బంతుల్లో 51 పరుగులు చేసి ముంబై జట్టును విజయతీరాలకు చేర్చారు. కాగా 48.3 ఓవర్ లోనే ముంబై టార్గెట్ చేదించి విజయం సాధించింది.


 అయితే ఇలా దేశవాళి క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్న సర్పరాజ్ ఖాన్  టీమ్ ఇండియాలో ఛాన్స్ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఫార్మాట్లకు అతీతంగా సెంచరీలతో చెలరేగిపోతున్న ఈ ముంబై ఆటగాడి విషయంలో అటు భారత సెలెక్టర్లు మాత్రం కరుణ చూపడం లేదు అని చెప్పాలి. సర్పరాజ్ ఖాన్ వెంటనే టీమిండియాలోకి  తీసుకోవాలంటూ అభిమానులు కూడా గత కొంతకాలం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నారు. టీమ్ ఇండియాలో ఆడేందుకు  అతనికి అన్ని రకాల అర్హతలు ఉన్నాయి అంటూ చెబుతూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: