గత కొంతకాలం నుంచి మెగా టోర్నీలో టీమిండియా వరుస వైఫల్యాలతో అభిమానులు అందరినీ కూడా నిరాశ పరుస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న రోహిత్ శర్మ కెప్టెన్సీలో బరిలోకి దిగిన టీమ్ ఇండియా జట్టు టైటిల్ గెలుస్తుంది అనుకుంటే సెమీఫైనల్ పోరులో కనీస పోటీ ఇవ్వలేక గోర ఓటమి చవి చూస్తుంది. అయితే ఎంతో పటిష్టమైన టీమిండియా జట్టు  పేలవ ప్రదర్శన చేయడానికి గల కారణాలు ఏంటి అనే విషయంపై చర్చ జరుగుతూ ఉండగా.. ఎన్నో సరికొత్త విషయాలు తెరమీదకి వస్తున్నాయి అని చెప్పాలి. ఇక ఇలాంటి సమయంలోనే ఐపిఎల్ పై కూడా కొంతమంది దుమ్మెత్తి పోస్తున్నారు. బీసీసీఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కారణంగా ఆటగాళ్లు నిర్విరామంగా మ్యాచులు ఆడుతూ ఉన్నారు. తద్వారా ఇక భారత జట్టు తరఫున సరైన ప్రదర్శన చేయలేకపోతున్నారు. ఎప్పుడైతే ఆటగాళ్లు ఐపిఎల్ లో ఆడటం మానేస్తారో.. అప్పుడు భారత జట్టులో మెరుగైన ప్రదర్శన చేస్తారు అంటూ కొంతమంది ఐపిఎల్ పై విమర్శలు గుప్పిస్తున్నారు అని చెప్పాలి. ఇలా గత కొంతకాలం నుంచి ఐపీఎల్ టోర్నీ నీ ఉద్దేశిస్తూ విమర్శలు చేస్తున్న వారి సంఖ్య పెరిగింది.


 ఇదే విషయంపై స్పందించిన టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత ఆటగాళ్లు విఫలమైన ప్రతిసారి కూడా ఐపీఎల్ ను తిట్టడం ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. ఎందరో క్రికెటర్లకు, నాన్ ప్లేయింగ్ స్టాఫ్ కు అన్నం పెట్టి ఐపీఎల్ పై నిరాధారమైన నిందలు వేయడం ఇకనైనా మానుకుంటే బాగుంటుంది. భారత్ క్రికెట్కు ఐపీఎల్ ఎంతో మంది యువ ఆటగాళ్లను అందిస్తుంది. ఎంతోమంది ఆటగాళ్లకు ఆర్థిక భరోసా ఇస్తుంది. అలాంటి కల్పవృక్షాన్ని ఆటగాళ్లు విఫలమైన ప్రతిసారి టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం ఏ మాత్రం సరికాదు అంటూ గంభీర్ వ్యాఖ్యానించాడు. కాగా ప్రస్తుతం గౌతమ్ గంభీర్ లక్నో జట్టుకి మెంటార్ గా వ్యవహరిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl