
ఒక రకంగా చెప్పాలి అంటే తన అద్భుతమైన ఆట తీరుతో సూర్యకుమార్ యాదవ్ ఏకంగా ప్రపంచ క్రికెట్లో ఉన్న ఎంతోమంది స్టార్ బౌలర్లకు సైతం నిద్రలేకుండా చేస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ చేస్తున్నాడు అంటే అతనికి బౌలింగ్ చేయడానికి బౌలర్లు సైతం భయపడిపోతున్నారు. అయితే ఇక అతని ఆట తీరు చూసిన తర్వాత ఎంతో మంది మాజీ ఆటగాళ్ళు అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇకపోతే ఇటీవల టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి సైతం సూర్య కుమార్ యాదవ్ ప్రతిభను కొనియాడాడు.
ప్రపంచం లో ఉన్న అత్యుత్తమ ఆటగాళ్ళను సూర్య కుమార్ యాదవ్ ఒకడని మాజీ కోచ్ రవి శాస్త్రి అభిప్రాయం వ్యక్తం చేశాడు. దూకుడైన ఆటతీరు వల్ల ఒకటి రెండు ఇన్నింగ్స్ లో విఫలం కావచ్చు. కానీ చాటింగ్ చేస్తున్న సమయంలో 15 నుండి 20 పరుగులు దాటాడు అంటే చాలు అతని విధ్వంసాన్ని ఆపడం ఎవరి తరము కాదు. ఏకంగా ప్రత్యర్థి బౌలర్లకు నిద్రలేకుండా చేస్తున్నాడు అంటూ రవి శాస్త్రి ప్రశంసలు కురిపించాడు. సూర్య కుమార్ యాదవ్ క్రేజీలో నిలబడి 30 - 40 బంతులు ఎదుర్కొన్నాడు అంటే మ్యాచ్ను గెలిపించగలడు అంటూ రవి శాస్త్రి తెలిపాడు.