
ఈ క్రమంలోనే ఇక అందరి అంచనాలకు తగ్గట్లుగానే టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన ఛాంపియన్ జట్లు అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోని ఇటీవల అర్జెంటీనా జట్టు మొదటి మ్యాచ్ లో ఓడిపోయి పరాజయంతో ఫిఫా వరల్డ్ కప్ లో ప్రస్థానని మొదలుపెట్టినప్పటికీ ఆ తర్వాత మాత్రం అద్భుతంగా పుంజుకుంది. రెండవ మ్యాచ్ లో విజయం సాధించి ఇక వరల్డ్ కప్ లో ముందుకు వెళ్లేందుకు అన్ని దారులను సుగమం చేసుకుంది అని చెప్పాలి.
ఇక ఇటీవలే ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా పోలాండ్తో జరిగిన మ్యాచ్లో కూడా అర్జెంటీనా జట్టు మరోసారి అదరగొట్టింది. మంచి విజయం సాధించింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక అర్జెంటీనా జట్టు కెప్టెన్ గా ఉన్న లియోనాల్ మెస్సి ఖాతాలో ఒక అరుదైన రికార్డు చేరిపోయింది. అర్జెంటీనా తరఫున అత్యధిక ప్రపంచకప్ మ్యాచ్ లు ఆడిన ఆటగాడిగా లీయోనల్ మెస్సి నిలిచాడు. ఇప్పటివరకు అర్జెంటీనా తరఫున 22 ప్రపంచ కప్ మ్యాచ్లు ఆడాడు అని చెప్పాలి. దిగజా అర్జెంటీనా ప్లేయర్ డిగో మారడోనా పేరున ఉన్న రికార్డును పోలాంతో జరిగిన మ్యాచ్లో బ్రేక్ చేశాడు మెస్సి. ఇక ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఫుడ్ బాల్ మ్యాచ్లు ఆడిన నాలుగవ ప్లేయర్గా రికార్డు సృష్టించాడు.