ఇటీవల ఆస్ట్రేలియాలో వెస్టిండీస్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా డబుల్ సెంచరీ తో చెలరేగిపోయాడు స్మిత్ అయితే కేవలం స్మిత్ మాత్రమే కాదు లబు షేన్ సైతం అజయమైన డబుల్ సెంచరీ చేయడంతో అటు ఆస్ట్రేలియా జట్టు భారీ స్కోరు చేసింది అని చెప్పాలి అయితే ఇప్పటికే తన కెరీర్లో ఎన్నో అద్భుతమైన రికార్డులను కొల్లగొట్టిన స్టీవ్ స్మిత్ ఇక ఇటీవల ఏకంగా క్రికెట్ లెజెండ్ రికార్డును కూడా బ్రేక్ చేశాడు అని చెప్పాలి. ఇక ఇందుకు సంబంధించిన వార్త కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం అయిన బ్రాడ్ మాన్ చేసిన 29 టెస్ట్ సెంచరీల రికార్డును స్మిత్ సమం చేశాడు. బ్రాడ్మన్ తన కెరీర్లు 52 మ్యాచ్లలో ఇలా 29 టెస్ట్ సెంచరీల రికార్డును అందుకున్నాడు. అయితే స్టీవ్ స్మిత్ కి మాత్రం ఇక ఈ అరుదైన రికార్డ్ సాధించడానికి 88 మ్యాచులు సమయం పట్టింది అని చెప్పాలి. వెస్టిండీస్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో స్మిత్ ఈ రికార్డును నమోదు చేశాడు అని చెప్పాలి. ఇక ఈ లిస్టులో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 41 సెంచరీలతో టాప్ ప్లేస్ లో ఉన్నాడు. ఆ తర్వాత స్టీవ్ వా 32 సెంచరీలు, మాథ్యూ హెడెన్ 30 సెంచరీలతో ఈ లిస్టులో కొనసాగుతూ ఉన్నారు అని చెప్పాలి.