ప్రస్తుతం భారత క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా కళ్ళు కాయలు కాసేలా ఐపీఎల్ మినీ వేలం కోసం ఎదురుచూస్తున్నారు అన్న విషయం తెలిసిందే. 2023 ఐపీఎల్ సీజన్ కోసం అన్ని రకాల ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్న బీసీసీఐ ఇటీవల రీటెన్షన్ ప్రక్రియను పూర్తి చేసింది. ఈ క్రమంలోనే ఐపిఎల్  లో ఉన్న పది ఫ్రాంచైజీలు కూడా ఇక తమ జట్టును మరింత పటిష్టవంతంగా మార్చుకునేందుకు కొంతమంది ఆటగాళ్లను వేలంలోకి వదిలేసాయ్. అదే సమయంలో మరికొంతమంది ఆటగాళ్లను మినీ వేలంలో కొనుగోలు చేసి జట్టును సరికొత్తగా పటిష్టవంతంగా మార్చుకోవాలని భావిస్తూ ఉన్నాయి.


 ఈ క్రమంలోనే బీసీసీఐ ముందుగా అనుకున్న విధంగానే డిసెంబర్ 23వ తేదీన కొచ్చి వేదికగా ఇక ఐపీఎల్ మినీ వేలం జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎవరికి ఎంత ధర పలక బోతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అంతేకాకుండా ఎవరు ఏ జట్టులోకి వెళ్లబోతున్నారు అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. కాగా ఏకంగా 991 మంది ఆటగాళ్లు ఈ వేలంలో పాల్గొంటూ ఉండగా.. 21 మంది ఆటగాళ్లు తమ బేస్ ప్రైస్ రెండు కోట్లుగా నమోదు చేసుకున్నారు. ఇందులో ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్, స్టార్ ఆల్ రౌండర్ సామ్ కర్రన్, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్స్ లాంటి స్టార్ ప్లేయర్లు కూడా ఉండడం గమనార్హం.


 అయితే ఇటీవలే టి20 వరల్డ్ కప్ లో అద్భుతమైన ప్రదర్శన చేసిన బెన్ స్టోక్స్ కి మరోవైపు తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఇక జట్టును విజయతీరాలకు చేర్చిన సామ్ కుర్రాన్ కు ఇక ఐపీఎల్ మినీ వేలంలో భారీ ధర పలకడం ఖాయం అన్నది మాత్రం తెలుస్తుంది. ఇద్దరి కోసం కూడా ఫ్రాంచైజీలు పోటీపడే అవకాశం ఉందని అందరూ అంచనా వేస్తున్నారు. అయితే వేలంలోకి వదిలేసిన సామ్ కుర్రాన్ ను మళ్ళీ చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో కేన్ విలియమ్స్ ను వదిలేసిన సన్రైజర్స్ బెన్ స్టోక్స్  ను కొనుగోలు చేసి ఇక సారధి బాధ్యతలను అప్పగించాలని భావిస్తుంది. ఈ క్రమంలోనే ఇద్దరికీ భారీ ధర పలకడం ఖాయం అనేది మాత్రం విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl