
ఈ ఓటమిని అస్సలు ఊహించని స్పెయిన్ ఆటగాళ్లు మరియు సహాయక సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు. ఇక ఈ మ్యాచ్ ను వీక్షించడానికి వచ్చిన స్పెయిన్ మద్దతుదారులు దుఃఖానికి హద్దు లేకుండా పోయింది. మ్యాచ్ జరిగిన తీరు చూస్తే అస్సలు ఆడుతుంది ఛాంపియన్ జట్లా అనిపించింది. అంతలా రెండు జట్లు కూడా గోల కోసం విశ్వ ప్రయత్నాలు చేశాయి... కానీ మ్యాచ్ కు నిర్దేశించిన సమయం కాకుండా,ఎక్స్ట్రా టైం లో కూడా గోల్ చేయడంలో రెండు జట్లు విఫలం అయ్యారు. ఇక కీలకం అయిన ఈ మ్యాచ్ లో విన్నర్ ఎవరి తేలాలి కాబట్టి మ్యాచ్ అంపైర్లు పెనాల్టీ షూట్ అవుట్ ను పెట్టడానికి నిర్ణయం తీసుకున్నారు.
అయితే ఇక్కడే డ్రామా అంతా జరిగింది.. మొదటి అవకాశాన్ని పొందిన మొరాకో జట్టు అద్బుతమగా బంతిని గోల్ పోస్ట్ లోకి నెట్టి మొదటి గోల్ ను సాధించింది, అయితే స్పెయిన్ మాత్రం గోల్ ను చేయడంలో ఫెయిల్ అయింది. అలా పెనాల్టీ షూట్ అవుట్ లో మొరాకో 3 గోల్స్ చేయగా స్పెయిన్ మాత్రం ఒక్క గోల్ తో సరిపెట్టుకుని ఓటమి పాలయింది. దీనితో స్పెయిన్ వరల్డ్ కప్ నుండి ఇంటిదారి పట్టగా.. మొరాకో క్వార్టర్ ఫైనల్ కు చేరుకొని చరిత్ర సృష్టించింది. ముఖ్యంగా మొరాకో గోల్ కీపర్ అద్భుతమైన టెక్నిక్ తో స్పెయిన్ ను అడ్డుకున్నాడు.