గత కొంతకాలం నుంచి టీమ్ ఇండియాను గాయాలు బెడద తీవ్రంగా వేధిస్తుంది అన్న విషయం తెలిసిందే . జట్టులో కీలక  ఆటగాళ్లుగా  కొనసాగుతున్నవారు గాయాల బారిన పడుతూ కీలకమైన మ్యాచులకు దూరం అవుతున్నారు. ఈ క్రమంలోనే మొన్నటికీ మొన్న టీమిండియా ఆడిన మెగా టోర్నలు అయిన ఆసియా కప్, వరల్డ్ కప్ సమయంలో కూడా ఇలాంటి గాయాల బెడదా టీమిండియాను ఇబ్బంది పెట్టింది. కీలక ఆటగాళ్లు దూరం కావడంతో ఇక టీమిండియా వ్యూహాలు మొత్తం తారుమారు అయ్యాయి అని చెప్పాలి.


 అయితే ఇక ఇప్పుడు ద్వైపాక్షిక సిరీస్లలో కూడా టీమిండియాను గాయాల బెడద మాత్రం వీడటం  లేదు అన్నది తెలుస్తుంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న టీం ఇండియా వన్ డే సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్లలో ఓడిపోయిన టీమిండియా ఒక మ్యాచ్ మిగిలిన ఉండగానే సిరీస్ ను బాంగ్లాదేశ్ కి అప్ప చెప్పింది. ఇదిలా ఉంటే టీమ్ ఇండియాలో కీలక ఆటగాళ్లు గాయం కారణంగా దూరమవుతున్నారు. ఇప్పటికే రిషబ్ పంత్ గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉండగా.. రెండవ వన్డే మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ శర్మ కూడా గాయం బారిన పడ్డాడు.


 ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ తో జరగబోయే మూడో వన్డేలో ఎవరు ఆడుతారు అన్న విషయంపై కూడా కన్ఫ్యూజన్ నెలకొంది. కాగా ఇదే విషయంపై స్పందించిన కోచ్ రాహుల్ ద్రావిడ్ క్లారిటీ ఇచ్చాడు. రోహిత్ గాయం తగ్గలేదని మూడో వన్డే కు దూరంగా ఉంటాడని పేర్కొన్నాడు. అలాగే టెస్ట్ సిరీస్ కి కూడా ఆడేది అనుమానంగానే ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే గాయాల బారిన పడిన దీపక్ చాహార్, కుల్దీప్ సీన్ లు కూడా మూడో వన్డే కి దూరం కాబోతున్నట్లు ద్రావిడ్ తెలిపాడు. అయితే ఇలా మంచి ప్రదర్శన చేస్తున్న ఆటగాళ్లు గాయాలు కారణంగా దూరమవుతుండడంతో టీమ్ ఇండియా ఫ్యాన్స్ నిరాశలో మునిగిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: