ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా పాపులారిటీ సంపాదించుకున్న క్రీడ ఏదైనా ఉంది అంటే అది ఫుట్బాల్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఫుట్బాల్ మ్యాచ్ వస్తుంది అంతే చాలు క్రీడా ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా మ్యాచ్ వీక్షించడానికి సిద్ధమైపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఖతార్ వేదికగా  ప్రారంభమైన ఫిఫా వరల్డ్ కప్ లోని ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా జరుగుతుంది అని చెప్పాలి.


 అయితే సాధారణంగా అంతర్జాతీయ క్రీడలలో ఏదో ఒక ఆటలో కొనసాగుతూ స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్న వారు ఇక తమ కెరియర్ ఎక్కువ కాలం కొనసాగించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏ చిన్న గాయం అయినా కూడా రిస్క్ తీసుకోకుండా ఇక గాయం నుంచి కోల్కున్న తర్వాతే మళ్ళీ ఆటలో భాగం కావడం లాంటివి చేస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇక్కడ ఒక ఆటగాడు మాత్రం ఏకంగా తన ప్రాణాలను పణంగా పెట్టి మరి దేశం కోసం ఆడుతూ ఉండడం... ఇక ప్రపంచ క్రీడ అభిమానులు అందరినీ కూడా అవాక్కయ్యేలా చేస్తూ ఉంది అని చెప్పాలి.


 ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా డచ్ దేశం తరఫున ఆడుతున్న స్టార్ ప్లేయర్ డెలీ బ్లిండ్ గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. అతడు ఎక్కువగా పరిగెత్తితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడి గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. అయితే ఫుట్బాల్ అంటేనే ఎప్పుడు పరిగెడుతూనే ఉండాలి. ఇది తెలిసినప్పటికీ ఇక అతని జీవితాన్నే పణంగా పెట్టి దేశం కోసం ఆడుతున్నాడు. ఇక ఎప్పుడూ తన వెంట రిఫ్రిబ్రీలేటర్ మిషన్ ను తీసుకెళ్తున్నాడు.  క్లిష్ట పరిస్థితుల్లో సైతం ఇక ప్రాణాలకు తెగించి దేశం తరఫున ఆడుతున్న అతని త్యాగానికి అందరూ సలాం కొడుతున్నారు అని చెప్పాలి. ఇటీవల యూఎస్ తో ఫ్రీ క్వార్టర్స్ మ్యాచ్లో గోల్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: