ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన మూడో వన్డే మ్యాచ్లో టీమ్ ఇండియా యువ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ తో చెలరేగిపోయాడు అన్న విషయం తెలిసిందే. 126 బంతుల్లోనే 200 పరుగులు చేసి అదరగొట్టేసాడు. ఇక ప్రపంచ క్రికెట్లో వన్డే ఫార్మాట్లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ చేసిన  ఆటగాడిగా నిలిచాడు ఇషాన్ కిషన్. అంతే కాకుండా టీమ్ ఇండియా తరఫున డబుల్ సెంచరీ చేసిన నాలుగవ ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. ఒకరకంగా ఈ డబుల్ సెంచరీ తో టాక్ ఆఫ్ ది క్రికెట్ గా మారిపోయాడు.


 ఎంతోమంది మాజీ క్రికెటర్లు అతని అద్భుతమైన బ్యాటింగ్ గురించి స్పందిస్తూ సోషల్ మీడియా వేదిక ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై స్పందించిన ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకల్ వాన్  ఒకవైపు ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ ని పొగుడుతూనే మరోవైపు టీమ్ ఇండియా చెత్త ప్రదర్శన చేస్తుంది అంటూ గాలి తీశాడు. 2011 ప్రపంచకప్ తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా పేలవంగా ఆడుతోంది అంటూ సెటైర్లు వేసాడు.  2011 ప్రపంచకప్ తర్వాత భారత్ పరిమిత ఓవర్ల ఫార్మాట్లో సాధించింది ఏమీ లేదు. పాత తరం ఆటతో చెత్త ప్రదర్శన కొనసాగిస్తుంది. వైట్ బాల్ క్రికెట్ లో అత్యంత దారుణంగా ఆడిన జట్టు ఏదైనా ఉందంటే అది టీమ్ ఇండియా మాత్రమే అంటూ మైకల్ వాన్ విమర్శలు చేశాడు.


 అందరూ ఐపీఎల్లో ఆడుతూ ఎంతో కొంత అనుభవాన్ని సాధిస్తుంటే అటు టీమిండియా ప్లేయర్లు వచ్చిన ఆట కూడా మర్చిపోతున్నారు అంటూ సెటైర్లు వేశాడు. ప్రపంచ వన్డే క్రికెట్ ను ఎలా ఆడాలో భారత్కు ఇషాన్ కిషన్ తన ఆట తీరుతో చూపించాడు. ఇప్పటికైనా పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా ఇషాన్ కిషన్ ల దూకుడు ఆడితే మంచిది అంటూ తనదైన శైలిలో  కామెంట్ చేశాడు మైకల్ వాన్. లేదంటే పాతతరం ఆటతో ప్రపంచ కప్ లు గెలవడం కష్టమే అంటూ వ్యాఖ్యానించాడు. కాగా మైకల్ వాన్ చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: