ఇండియా మరియు బంగ్లాదేశ్ ల మధ్యన నిన్నటి నుండి జరుగుతున్న చట్టోగ్రామ్ టెస్ట్ రెండవ రోజు ఆట కాసేపటి క్రితమే ప్రారంభం అయింది. నిన్న ఆట ముగిసే సమయానికి 6 వికెట్లకు 278 పరుగులు చేసిన టీం ఇండియా... కనీసం మరో 100 పరుగులు జోడించి బంగ్లా ముందు మంచి స్కోర్ ను ఉంచాలి అనుకుని స్టార్ట్ చేశారు. నిన్న ఆటలో పుజారా 90 పరుగుల వద్ద అవుట్ అయిన విషయం తెలిసిందే. అయితే మాములుగా టెస్ట్ లలో సెంచరీ మార్క్ ను అందుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది.. అది కూడా 90 పరుగులు చేరుకున్న తర్వాత సెంచరీ మిస్ అయితే ఆ బాధ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

గతంలో ఇండియా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అయితే ఎన్ని సార్లు 90 లలో అవుట్ అయ్యాడు అన్నది రికార్డులు చూస్తే తెలుస్తుంది. అందుకే సెంచరీకి మరో 10 15 పరుగులు ఉండగానే జాగ్రత్తగా ఆడుతూ సెంచరీ మార్క్ ను అందుకోవాలి. అలా చేయడంలో నిన్న పుజారా విఫలం కాగా, ఈ రోజు ఆటమొదలైన కాసేపటికే శ్రేయస్ అయ్యర్ కూడా కేవలం 86 పరుగుల వద్ద ఉండగా ఎబదత్ హుస్సేన్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యి నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. వాస్తవంగా నిన్న ఆటలో ఎబదత్ బౌలింగ్ లోనే శ్రేయస్ అయ్యర్ బౌల్డ్ అయ్యాడు... కానీ అదృష్టవశాత్తూ బైల్స్ కింద పడకపోవడం వలన బ్రతికిపోయాడు. లేదంటే నిన్ననే అవుట్ అవ్వాల్సింది.

అయితే ఈ రోజు మాత్రం ఏ మాత్రం మిస్ కాకుండా ఎబదత్ స్ట్రెయిట్ బాల్ ఆఫ్ స్టంప్స్ మీదుగా వేసి వికెట్లను గిరాటేశాడు. దీనితో ఈసారి శ్రేయస్ అయ్యర్ మైదానాన్ని వీడక తప్పలేదు. అలా శ్రేయస్ అయ్యర్ సెంచరీకి మరో 14 పరుగుల దూరంలో ఉండగా అవుట్ అయ్యాడు. క్రీజులో ప్రస్తుతం అశ్విన్ మరియు కుల్దీప్ లు నెమ్మదిగా మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. కనీసం ఇప్పుడున్న స్కోర్ కు మరో 43 పరుగులు జోడిస్తే మొదటి ఇన్నింగ్స్ స్కోర్ 350 అవుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: