
ఇంతకీ కారణం ఏంటో తెలుసా.. మీ అందరికీ తెలిసే ఉంటుంది. అదేంటో కాదు ఆదివారం రోజున అందరూ ఎదురు చూస్తున్న ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఒకవైపు డిపెండింగ్ ఛాంపియన్ ఉంటే మరోవైపు మాజీ ఛాంపియన్ ఉంది. ఈ రెండు జట్లు కూడా మరోసారి టైటిల్ గెలిచేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాయ్. ఇరు జట్ల ఆట తీరు కూడా నువ్వా నేనా అన్నట్లు సాగుతూ వచ్చింది అని చెప్పాలి. దీంతో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.
ఒకవైపు లీయోనల్ మెస్సి, మరోవైపు అంబాపే ప్రస్తుతం గోల్డెన్ బూట్ అవార్డు రేస్ లో కూడా ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ ఇద్దరిలో ఎవరు పైచేయి సాధిస్తారు. ఇక చివరికి విశ్వవిజేయతగా ఎవరు నిలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే గత గణంకాలు చూసుకుంటే మాత్రం నాలుగు సార్లు ఈ రెండు జట్లు వరల్డ్ కప్ లో తలబడగా రెండుసార్లు అర్జెంటీనా గెలిచింది. ఇక ఒకసారి ఫ్రాన్స్ గెలవగా ఒక మ్యాచ్ మాత్రం ఫలితం తేలలేదు. ఇలా పాత గణాంకాలు చూస్తే అర్జెంటినా వైపే ఉన్నప్పటికీ డిపెండింగ్ ఛాంపియన్స్ అయినా ప్రాన్స్ ని తక్కువ ఉంచడం అంచనా వేయడానికి లేదు. దీంతో ఇక ఈ ఆదివారం ప్రేక్షకులందరికీ అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ అటు ఫుట్బాల్ వరల్డ్ కప్ ఫైనల్ ద్వారా అందబోతోంది అన్నది తెలుస్తుంది.