ఇక వెస్ట్ బెంగాల్‌లో ఫిఫా ప్రపంచకప్ ఫీవర్ బాగా పెరిగిపోయింది. అర్జెంటీనా విజయం కోసం మెస్సీ అభిమానులు ఆదివారం నాడు ఏకంగా ఓ యాగం కూడా నిర్వహించి విజయం సాధించాలని వేడుకున్నారు.వరల్డ్ కప్ ట్రోఫీని మెస్సీ లేదా ఎంబాప్పేలో ఎవరు గెలుస్తారంటూ నేడు ప్రపంచ వ్యాప్తంగా కూడా పెద్ద చర్చ జరుగుతోంది. ప్రపంచకప్ ట్రోఫీని మెస్సీకి అందజేయాలని ఈ సందర్భంగా మెస్సీ ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తూర్పు మేదినీపూర్‌లోని ఘటాల్‌లో యజ్ఞం చేసి మెస్సి కోసం ప్రార్థించారు.అర్జెంటీనా వర్సెస్ ఫ్రాన్స్ మ్యాచ్ ఈరోజు రాత్రి భారత టైమింగ్స్ ప్రకారం రాత్రి 8.30 గంటలకు జరగనుంది. బెంగాల్‌లో చాలా మంది ఫుట్‌బాల్ అభిమానులు కూడా అర్జెంటీనాకు మద్దతుదారులుగా నిలిచారు. ఫుట్‌బాల్ మ్యాచ్‌లను చూసేందుకు ఇక కోల్‌కతా సహా జిల్లాల్లో పెద్ద టీవీ స్క్రీన్‌లను కూడా ఏర్పాటు చేశారు. ఇక అభిమానులు ఫుట్‌బాల్ మ్యాచ్‌లను ఆస్వాదించేందుకు సిద్ధమయ్యారు.అయితే ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ తన జీవితంలో చివరి మ్యాచ్ ఆడబోతున్నాడు.


ఇలాంటి పరిస్థితుల్లో మెస్సీకి మరింత ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అభిమానులు కోరుతున్నారు. మెస్సీ అభిమానులు అయితే అర్జెంటీనా గెలవాలని, మెస్సీ చేతిలో వరల్డ్ కప్ ట్రోఫీని చూడాలని కోరుకుంటున్నారు. పశ్చిమ్ మేదినీపూర్ జిల్లాలోని ఘటల్ వరల్డ్ కప్‌లో జరుగుతున్న వరల్డ్ కప్ ఫుట్‌బాల్ ఫైనల్ మ్యాచ్‌ను చూసేందుకు పలు చోట్ల జాయింట్ స్క్రీన్ లను కూడా ఏర్పాటు చేశారు. ఘటల్ అరవింద్ స్టేడియం మైదానంలో మెస్సీ ఫ్యాన్స్ అయితే ప్రత్యేక పూజలు నిర్వహించారు.మెస్సీ చేతిలో వరల్డ్ కప్ ట్రోఫీని చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారని, అందుకే ఈ ప్రత్యేక పూజలు జరిపామంటూ పేర్కొన్నారు. ఇక ఘటల్‌లోని ప్రసిద్ధ క్లబ్‌లలో ఘటల్ పయనీర్ క్లబ్ ఒకటి.ఇక ఫైనల్ మ్యాచ్‌లో మెస్సీ అద్భుత ప్రదర్శనను చూడాలని ఘటల్ పయనీర్ క్లబ్ సభ్యులు మెస్సీ చిత్రం ఇంకా అర్జెంటీనా జెర్సీతో ఈ ప్రత్యేక ప్రార్థనను జరిపారు. ఈ భక్తుల కోరికను భగవంతుడు తీరుస్తాడా లేదా అనే సమయం ఆసన్నమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: