టీ 20 వరల్డ్ కప్ 2022 ఫైనల్ లో పాకిస్తాన్ మరియు ఇంగ్లాండ్ జట్లు తలపడి చివరికి ఇంగ్లాండ్ విజయకేతనాన్ని ఎగురవేసి బట్లర్ సారధ్యంలో కప్ ను ముద్దాడింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ పాకిస్తాన్ పర్యటనలో టెస్ట్ సిరీస్ ను ఆడేందుకు వెళ్ళింది. ఇందులో మూడు టెస్ట్ లు ఆడాల్సి ఉండగా , ఇప్పటికే మొదటి రెండు టెస్ట్ లలో ఆతిధ్య పాకిస్తాన్ ఓడిపోయి సిరీస్ ను పోగొట్టుకుంది. సొంతగడ్డపై ఇంగ్లాండ్ ను ఓడిస్తుంది అని భావించిన పాక్ క్రికెట్ యాజమాన్యం మరియు అభిమానులు తీవ్రంగా నిరాశపడ్డారు. ముఖ్యంగా పాక్ బౌలర్లు గెలుపు అవకాశాలను సృష్టిచడంలో దారుణంగా ఫెయిల్ అయ్యారు.

ప్రస్తుతం కరాచీ వేదికగా మూడవ టెస్ట్ జరుగుతోంది, ఈ టెస్ట్ లోనూ స్పష్టమైన ఆధిక్యతను చూపిస్తూ విజయం దిశగా దూసుసుకువెళుతోంది బెన్ స్టోక్స్ సేన. మూడవ రోజు ఆటముగిసే సమయానికి ఇంగ్లాండ్ విజయానికి మరో 55 పరుగుల దూరంలో నిలిచిపోయింది. క్రీజులో డక్కెట్ 50 పరుగులు మరియు స్టోక్స్ 10 పరుగులు చేశారు. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ దాదాపుగా ఓడిపోయినట్లే... రేపు ఉదయం సెషన్ లోనే మ్యాచ్ ముగిసిపోతుంది. ఈ టెస్ట్ ను కూడా ఓడిపోతున్న పాకిస్తాన్ ఇంగ్లాండ్ చేతిలో క్లీన్ స్వీప్ కు గురయ్యి దారుణ పరాభవాన్ని ఎదుర్కోనుంది.

ఇక ఈ సిరీస్ ఓటమిలో ప్రధాన బాధ్యత పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ దే అని చెప్పాలి. సిరీస్ ఆసాంతం బాబర్ అజాం ఒక బ్యాట్స్మన్ గా పర్వాలేదనిపించినా , కెప్టెన్ గా మాత్రం ఫెయిల్ అయ్యాడు. మూడు టెస్ట్ లలో కనీసం ఒక గెలుపు లేదా డ్రా అయినా చేసుకోవడంలో సమిష్టిగా విఫలం అయ్యారు. మొదటి టెస్ట్ ఓటమి నుండి దారుణామైన విమర్శలను ఎదుర్కొంటున్న పాకిస్తాన్ టీం మరియు కెప్టెన్ బాబర్ ఆజామ్.. ఇప్పుడు క్లీన్ స్వీప్ పట్ల తమ దేశ ప్రజలకు మరియు పాక్ యాజమాన్యానికి ఏ విధమైన సమాధానం ఇస్తాడు అన్నది చూడాలి. ఒకవేళ కెప్టెన్ గా దిగిపోతాడా అన్నది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.      


మరింత సమాచారం తెలుసుకోండి: