సాధారణం గా క్రీడాకారులు ఇక మ్యాచ్ గెలిచినప్పుడు లేదా గోల్స్ సాధించినప్పుడు కూడా ప్రత్యేకమైన సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక కొంత మంది ఆటగాళ్లు ఇలా గోల్ సాధించిన దాని కంటే వారి భిన్నమైన సెలబ్రేషన్స్ కారణంగానే కెమెరాలను తెగ ఆకర్షిస్తూ ఉంటారు. ఇక ఎవరైనా ఆటగాళ్లు ఇలా భిన్నమైన సెలబ్రేషన్స్ చేసుకున్నారు అంటే చాలు అది కాస్త సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది.


 అయితే కొంతమంది విచిత్రమైన సెలబ్రేషన్స్ తో వార్తల్లో నిలుస్తూ విమర్శలు ఎదుర్కోవడం కూడా జరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక మరి కొంతమంది ఇక ప్రత్యర్థులు చేసిన కవ్వింపులకు దీటుగా కౌంటర్ ఇచ్చేలా సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు. ఇంకొంత మంది అసభ్యకర రీతిలో సెలబ్రేషన్స్ చేసుకోవడం కూడా చేసి వార్తలో హాట్ టాపిక్ గా మారి పోతూ ఉంటారు. అయితే ఇటీవల ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో భాగం గా హోరా హోరీగా జరిగిన పోరులో ఫ్రాన్స్ పై గెలిచిన తర్వాత అర్జెంటీనా గోల్డ్ కీపర్ ఎమిలియానో మార్టినేజ్  చేసుకున్న సెలబ్రేషన్స్ కాస్త ప్రస్తుతం ఆర్ట్హాట్ టాపిక్ గా మారి పోయాయి.


 అసభ్యకర రీతిలో ఏకంగా అతను సెలబ్రేషన్స్ చేసుకోవడంతో కొన్ని విమర్శలు కూడా వచ్చాయి అని చెప్పాలి. అయితే ఇక ఇటీవల ఇక తన సెలబ్రేషన్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అర్జెంటీనా గోల్ కీపర్ మార్టినేజ్  మ్యాచ్ జరుగుతున్న సమయం లో ఫ్రాన్స్ అభిమానులు తనను గేలి చేస్తూ మాట్లాడినందుకే తాను అలాంటి సెలబ్రేషన్స్ చేసుకున్నాను అంటూ చెప్పుకోవచ్చాడు. తనతో అహంకారం పనికి రాదు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే మార్టినేజ్  ఇలా చేయడం కొత్తేమి కాదు 2021 వరల్డ్ కప్ లో కూడా ఇలాంటివి చేసి వార్తల్లో నిలిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: