
ఇక ఇలా వరల్డ్ కప్ గెలవడంతో అభిమానులు మాత్రమే కాదు మెస్సి కూడా ఆనందంలో మునిగిపోయాడు అని చెప్పాలి. అయితే వరల్డ్ కప్ గెలిచి రోజులు పూర్తవుతున్న కూడా ఇంకా మెస్సి ఆ మూడ్ లో నుంచి బయటకు రాలేదు అనేది తెలుస్తుంది. ఈ క్రమంలోనే అతనికి వరల్డ్ కప్ ఎంత ఇంపార్టెంట్ అన్న విషయం తెలియజేసేలా ఇటీవల ఒక ఫోటో పోస్ట్ చేశాడు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయి అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంది అని చెప్పాలి.
వరల్డ్ కప్ ట్రోఫీపై చేయి వేసుకొని పక్కలో పెట్టుకొని పడుకున్నాడు మెస్సి. ఇక ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాను ఊపేస్తోంది అని చెప్పాలి ఇక ఇది చూసిన ఎంతోమంది అభిమానులు గ్రేటెస్ట్ ప్లేయర్ ఆఫ్ ఆల్ టైం మెస్సికి చివరికి కల నెరవేరింది అంటూ కామెంట్లు చేస్తూ ఉండటం గమనార్హం. అంతే కాదు ఈ దిగ్గజా ఆటగాడికి ఆట పట్ల ఉన్న ప్రేమకు ఇక ఈ ఫోటోనే నిదర్శనం అంటూ ఎంతోమంది కామెంట్లు చేస్తున్నారూ అని చెప్పాలి. అయితే లియోనల్ మెస్సి ఇలా పోస్ట్ పెట్టాడో లేదో అది నిమిషాలు వ్యవధిలో వైరల్ గా మారిపోయి ప్రపంచ క్రీడాభిమానుల దృష్టిని ఆకర్షిస్తుంది అని చెప్పాలి.