ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో అర్జెంటటీనా గెలిచింది అన్న విషయం తెలిసిందే.లియోనల్ మెస్సి కెప్టెన్ గా వ్యవహరిస్తున్న అర్జెంటీనా జట్టు మూడోసారి వరల్డ్ కప్ విజేతగా నిలిచింది అని చెప్పాలి. అయితే వరల్డ్ కప్ ఫైనల్ జరిగి రోజులు గడుస్తున్న ఇంకా ఈ వరల్డ్ కప్ గెలుపుకు సంబంధించిన చర్చ మాత్రం అస్సలు ఆగడం లేదు అని చెప్పాలి. ఈ క్రమంలోనే సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ కూడా అద్భుతమైన ప్రదర్శన చేస్తే జట్టును గెలిపించుకున్న మెస్సి పై ప్రశంసలు కురిపిస్తున్నారు. గ్రేటెస్ట్ ప్లేయర్ ఆఫ్ ఆల్ టైం అంటూ ఎంతోమంది కామెంట్లు కూడా చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే భారత్కు సంబంధించిన ఫుట్బాల్ అభిమానులు కొంతమంది ఇక ఇదే విషయంపై స్పందిస్తూ అర్జెంటీనా జట్టుకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక ఎంతోమంది అభిమానుల లాగానే మన దేశంలోనే అస్సాం రాష్ట్రానికి చెందిన ఓ రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అస్సాం కి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అబ్దుల్ కలీగ్ ఫైనల్లో విజయం సాధించిన అర్జెంటినా జట్టు కెప్టెన్ మెస్సిని అభినందిస్తూ మీకు అస్సాం తో సంబంధం ఉన్నందుకు చాలా గర్విస్తున్నాము అంటూ పొంతనలేని పోస్ట్ పెట్టాడు

 ఇక ఇలా కాంగ్రెస్ ఎంపీ పెట్టిన పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి   ఇక అతను పెట్టిన పోస్ట్ చూసి అందరూ ఒక్కసారిగా నివ్వేరపోయారు. అర్జెంటీనా స్టార్ ప్లేయర్ మెస్సి ఏంటి అస్సాంతో సంబంధం ఏంటి అంటూ  సందిగ్ధంలో  పడిపోయారు. ఎంపీ చెప్పింది నిజమేనా అని ఒకసారి గూగుల్ తల్లిని ఆశ్రయిస్తూ క్రాస్ చెక్ చేసుకోవడం లాంటివి కూడా చేశారు అని చెప్పాలి. ఒక నేటిజన్ అయితే నేరుగా కాంగ్రెస్ ఎంపీ అబ్దుల్ ను ఇది నిజామేనా అంటూ ప్రశ్నించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: