ఇండియా మరియు బంగ్లాదేశ్ జట్ల మధ్యన గత ఒకటిన్నర నెలలుగా జరుగుతున్న వన్ డే సిరీస్ మరియు టెస్ట్ సిరీస్ ముగిసే సమయం ఆసన్నమైంది. ముందుగా జరిగిన 3 వన్ డే ల సిరీస్ లో ఇండియా 2-1 తేడాతో ఓడిపోయింది. అయితే రెండు టెస్ట్ ల సిరీస్ లో ఇండియా బంగ్లాను క్లీన్ స్వీప్ చేసి గర్వంగా ఇండియా గడ్డపైన అడుగుపెట్టాలని భావిస్తోంది. అందులో భాగంగా మూడు రోజుల క్రిందట జరిగిన మొదటి టెస్ట్ లో ఇండియా భారీ తేడాతో గెలిచింది. అయితే ఈ మ్యాచ్ కూడా నాలుగు రోజులలోనే ముగియాల్సి ఉండగా , ఆఖర్లో బంగ్లా ఆటగాళ్లు ప్రతిఘటించడంతో అయిదవ రోజు వరకు డ్రాగ్ అయింది.

ఈ మ్యాచ్ లో విశేషంగా రాణించిన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మొత్తం 8 వికెట్లతో పాటుగా మొదటి ఇన్నింగ్స్ లో కీలకమైన 40 పరుగులు చేశాడు. కాగా ఈ రోజు నుండి రెండవ టెస్ట్ ఢాకా లో స్టార్ట్ అయింది. అయితే ఈ మ్యాచ్ లోనూ ఇండియా గెలిచేందుకు అవకాశాలు ఉన్నాయి. ఓపెనర్ శుబ్ మాన్ గిల్, పుజారా, పంత్ మరియు శ్రేయస్ అయ్యర్ లు ఫామ్ లో ఉండడం బాగా కలిసొచ్చే అంశం అని చెప్పాలి. కెప్టెన్ కె ఎల్ రాహుల్ మరియు విరాట్ కోహ్లీ రాణించాల్సి ఉంది.  ఈ మ్యాచ్ లో ఇండియా తరపున కుల్దీప్ యాదవ్ కు బదులుగా పేసర్ ఉనద్కట్ ను జట్టులోకి తీసుకున్నారు కాగా మొదట బ్యాటింగ్ చేస్తున్న షకిబుల్ హాసన్ సేన టీ సమయానికి 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది.

ఈ మ్యాచ్ లో జట్టులో చోటు దక్కించుకున్న బంగ్లా మాజీ కెప్టెన్ మోమినుల్ హాక్ అర్ధ సెంచరీ సాధించి క్రీజులో ఉన్నాడు. గత మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్ లో అరంగ్రేటం లోనే సెంచరీ చేసిన యువ ఆటగాడు జాకీర్ హాసన్ మాత్రం స్వల్ప స్కోర్ కే వెనుతిరిగాడు. ఇండియా బౌలర్లలో ఉనద్కట్ 2 మరియు అశ్విన్ 2 వికెట్లు తీయగా ఉమేష్ యాదవ్ క్క వికెట్ తో మెరిశాడు. మరి ఈ రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాను ఆల్ అవుట్ చేస్తుందా చూడాలి.  

   

మరింత సమాచారం తెలుసుకోండి: