2023 ఐపీఎల్ సీజన్ కు సంబంధించిన మినీ వేలం ప్రక్రియ ముగిసింది అన్న విషయం తెలిసిందే. ఎంతో మంది స్టార్ ప్లేయర్లు ఈ మినీ వేలంలో ఉన్నారు. వారికి భారీ ధర పలకడం ఖాయం అని అందరూ అనుకున్నారు. అనుకున్నట్లుగానే ఇక స్టార్ ప్లేయర్లకు మంచి ధరను సొంతం చేసుకున్నారు అని చెప్పాలి. కానీ అంతకుమించిన ధరను సొంతం చేసుకుని ఒక యువ ఆల్ రౌండర్ మాత్రం అందరిని ఆశ్చర్యపరిచాడు. అంతేకాదు ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక ధరను సొంతం చేసుకున్న ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. ఇటీవల జరిగిన మినీ వేలంలో ఇంగ్లాండ్ లో యువ ఆల్రౌండర్ గా కొనసాగుతున్న సామ్ కరన్ 18.5 కోట్ల ధర పలికాడు అన్న విషయం తెలిసిందే.


 అతని కోసం వివిధ ఫ్రాంచైజీల మధ్య తీవ్రమైన పోటీ జరగగా చివరికి పంజాబ్ కింగ్స్ జట్టు అతన్ని భారీ ధరకు కొనుగోలు చేసి ఇక జట్టులోకి ఆహ్వానించింది అని చెప్పాలి. అయితే  సామ్ కరన్ ఐపీఎల్లోకి అడుగుపెట్టిన సమయంలోనే పంజాబ్ జట్టు తరఫున ఆడాడు. ఇక మళ్లీ ఇప్పుడు ఎన్నో ఏళ్ల తర్వాత తన పాత ఫ్రాంచైజీకి వచ్చేస్తున్నాడు అని చెప్పాలి. గత టి20 ప్రపంచ కప్ లో ఇంగ్లాండ్ విజయంలో సామ్ కరన్ అటు ఆల్ రౌండ్ ప్రదర్శనతో కీలక పాత్ర పోషించాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అతనికి భారీ ధర వెచ్చించడానికి కూడా ఫ్రాంచైజీలు వెనకడుగు వేయలేదు.

 అయితే సామ్ కరన్ కి  భారీ ధర వెచ్చించడానికి గల కారణం ఏంటి అన్న విషయంపై పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీకి సహ వ్యవస్థాపకుడిగా ఉన్న నెస్ వాడియా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మా దగ్గర తగినంత మొత్తంలో పర్స్ మనీ ఉండటంతోనే సామ్ కరన్ను దక్కించుకున్నాం. అయితే సామ్ కరన్ మళ్లీ మాతో కలవడం ఎంతో ఆనందంగా ఉంది. గతంలోనే అతన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నించాం. కానీ అప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని కొనుగోలు చేసింది. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అతని వదిలేయకూడదు అనే ఉద్దేశంతోనే మళ్లీ వేలంలో భారీ ధర వెచ్చించి అతని దక్కించుకున్నాం. 24 ఏళ్ళ సామ్ కరన్ ప్రపంచ శ్రేణి ఆటగాడు. అలాగే సికిందర్ రజా ను కూడా సొంతం చేసుకోవడం ఆనందంగా ఉంది అంటూ నెస్ వాడియా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl