అందరూ ఊహించినట్లుగానే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి సంబంధించిన మినీ వేలం ప్రక్రియ ఎంతో రసవత్తరంగా సాగింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఐపిఎల్ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎంతో మంది ఆటగాళ్లు రికార్డు ధర పలికారు అని చెప్పాలి. దీంతో ఐపీఎల్ వేలంలో ఎవరు ఎంత ధర పలికారు అన్న విషయం కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. అదే సమయంలో ఇక ఎంతోమంది యువ ఆటగాళ్లు కూడా ఐపీఎల్ లో ఆయా జట్లలో ఛాన్స్ దక్కించుకుని ఇక సరికొత్తగా తమ ప్రతిభను నిరూపించుకునేందుకు సిద్ధమైపోయారు


 మొత్తంగా 405 మంది ప్లేయర్లు వేలంలోకి రాగా.. 80 మంది ఆటగాళ్లను అని ఫ్రాంచైజీలు కలిసి సొంతం చేసుకున్నాయి అని చెప్పాలి. ఇక ఇందులో 51 మంది భారత ప్లేయర్లు ఉండగా.  29 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే ఇక ఈ ఏడాది జరిగిన మినీ వేలంలో అటు ఆటగాళ్ల పంట పండింది అని చెప్పాలి. ఏకంగా ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ సామ్ కరణ్ ఇప్పటివరకు ఐపీఎల్ హిస్టరీలోనే ఎన్నడూ లేని విధంగా 18.5 కోట్ల ధర పలికాడు. అతన్ని పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా ప్లేయర్ కామరూన్ గ్రీన్ సైతం 17.5 కోట్లకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది అని చెప్పాలి.


 అదే సమయంలో గతంలో ఎన్నడు లేని విధంగా సన్రైజర్స్ ఈసారి అత్యధిక పర్స్ మనీతో మినీ వేలంలో పాల్గొంది. ఈ క్రమంలోనే 13 మంది ప్లేయర్లను సొంతం చేసుకుంది అని చెప్పాలి. ఈ వేలంలో టీమిండియా మాజీ ఓపెనర్ అయిన వీరేంద్ర సెహ్వాగ్ మేనల్లుడు మయాంక్ దాగర్ కూడా పాల్గొన్నాడు అన్నది తెలుస్తుంది. అయితే హైదరాబాద్ జట్టు అతని దక్కించుకుంది. ఢిల్లీకి చెందిన 26 ఏళ్ల ఆల్రౌండర్ మయాంక్  కోసం రాజస్థాన్ రాయల్స్ సన్రైజర్స్ మధ్య పోటీ ఏర్పడింది. ఈ క్రమంలోనే అతని బేస్ ప్రైస్ 20 లక్షలు ఉండగా హైదరాబాద్ జట్టు 1.8 కోట్లకు అతని సొంతం చేసుకుంది. అతడు కుడిచేతి వాటం బ్యాట్స్మెన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl