
ఈ క్రమంలోనే ఇలా ఐపీఎల్ మినీ వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లలో అటు ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఏకంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ బెన్ స్టోక్స్ కోసం భారీ మొత్తంలో వెచ్చించింది. ఏకంగా 16.2 కోట్లు పెట్టి అతన్ని జట్టులోకి తీసుకుంది అని చెప్పాలి. అంటే ఇక బెన్ స్టోక్స్ కి పెట్టిన మొత్తం అటు జట్టు కెప్టెన్ గా ఉన్న మహేంద్ర సింగ్ ధోనీకి చెల్లిస్తున్న దానికంటే ఎక్కువ కావడం గమనార్హం. దీంతో ధోని తర్వాత బెన్ స్టోక్స్ కి కెప్టెన్సీ అప్పగించే ఛాన్స్ ఉంది అంటూ ప్రచారం మొదలైంది.
అయితే ఇక 16.25 కోట్లు పెట్టి ఇక బెన్ స్టోక్స్ ను జట్టు యాజమాన్యం తీసుకోవడంపై అటు ధోని ఎలా స్పందిస్తాడు అని అభిమానులు కూడా ఎదురు చూశారు. ఇక ఇటీవల బెన్ స్టోక్స్ ని కొనుగోలు చేయడంపై కెప్టెన్ ధోని సంతోషం వ్యక్తం చేశాడు అంటూ చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ తెలిపాడు. తీవ్ర పోటీ మధ్య బెన్ స్టోక్స్ ని దక్కించుకోవడం మా అదృష్టం. సమయాన్ని బట్టి కెప్టెన్సీ పై ధోని నిర్ణయం తీసుకుంటాడు అంటూ కాశీ విశ్వనాథన్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం మా జట్టు ఎంతో పటిష్టంగా కనిపిస్తుంది. ఇక వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్లో బాగా రాణిస్తాం అనే నమ్మకం ఉంది అంటూ చెన్నై జట్టు సీఈవో చెప్పుకుచ్చాడు.