గత కొంతకాలం నుంచి సరైన ప్రదర్శన చేయడం లేదు అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్న డేవిడ్ వార్నర్ ఇక ఇటీవల దక్షిణాఫ్రికా తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో మాత్రం అద్భుతమైన బ్యాటింగ్ చేసి చూపించాడు అన్న విషయం తెలిసిందే. ఏకంగా తన అద్భుతమైన బ్యాటింగ్ ప్రతిభను  కనబరిచి డబుల్ సెంచరీ తో చెలరేగిపోయాడు. ఈ క్రమంలోనే ఎన్నో అరుదైన రికార్డులను కూడా ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పాలి. కాగా ఇప్పటివరకు డేవిడ్ వార్నర్ ఏకంగా 45 సెంచరీలు  సాధించాడు అని చెప్పాలి. ఇక మొత్తం ఓపెనర్ గానే సెంచరీలు సాధించడం గమనార్హం. ఇందులో  20 సెంచరీలు వన్డేలలో.. టెస్టులలో 25 శతకాలు ఉన్నాయి.



  అయితే అటు డేవిడ్ వార్నర్ కు దక్షిణాఫ్రికా తో జరిగిన టెస్ట్ మ్యాచ్ తన కెరీర్లో 100వ టెస్టు మ్యాచ్ కావడం గమనార్హం. ఇలా తన 100వ టెస్టు మ్యాచ్లో సెంచరీ చేయడం కాదు డబల్ సెంచరీ చేసి అదరగొట్టాడు అని చెప్పాలి. గత కొంతకాలం నుంచి తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్ తోనే సమాధానం చెప్పాడు. అదే సమయంలో ఎన్నో ప్రపంచ రికార్డులను కూడా ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న వారిలో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల లిస్టులో రెండవ స్థానంలో కొనసాగుతూ ఉన్నాడు డేవిడ్ వార్నర్  ఇకపోతే ఇటీవల డబుల్ సెంచరీ సాధించడం ద్వారా భారత దిగ్గజ ప్లేయర్ అయినా సచిన్ టెండూల్కర్ రికార్డ్ సమం చేశాడు.


 డేవిడ్ వార్నర్ ఇప్పటివరకు ఏకంగా 45 సెంచరీలు ఆస్ట్రేలియా ఓపెనర్ గానే సాధించాడు అని చెప్పాలి. అయితే అటు టీమిండియా దిగ్గజ బ్యాట్స్మెన్  సచిన్ టెండూల్కర్ సైతం తన కెరియర్లో 45 సెంచరీలను ఓపెనర్ గానే సాధించడం గమనార్హం. కాగా మొత్తంగా సచిన్ 100 సెంచరీలు సాధించాడు అన్న విషయం తెలిసిందే.  ఇలా ఏకంగా సచిన్ తో పాటు డేవిడ్ వార్నర్ కూడా ఓపెనర్ గా ఎక్కువ సెంచరీలు సాధించిన ప్లేయర్లుగా నిలిచారు. అంతేకాకుండా ఇక వందో టెస్టులో సెంచరీ సాధించిన పదిమంది ఆటగాళ్ల సరసన చేరిపోయాడు ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్.

మరింత సమాచారం తెలుసుకోండి: