2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరిపిస్తుంది బీసీసీఐ. ఈ క్రమంలోనే ఇక ఐపీఎల్ కు సంబంధించిన విషయం ఏదైనా సోషల్ మీడియాలోకి వచ్చింది అంటే చాలు అది నిమిషాల వ్యవధిలో వైరల్ గా మారిపోతూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. కాగా ఐపీఎల్ ప్రస్తుతం ప్రపంచంలోనే రిచెస్ట్ లీక్ గా కొనసాగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఐపిఎల్ లో భాగం అయిన ఆటగాళ్లు కూడా ఏ రేంజ్ లో డబ్బులు సంపాదిస్తుంటారో అన్న విషయంపై అందరికీ ఒక క్లారిటీ కూడా ఉంది.


 అందుకే దేశవాలి క్రికెట్ లో రాణిస్తున్న ఆటగాళ్లకు ఒక్కసారి ఐపీఎల్లో ఛాన్స్ వచ్చిందంటే చాలు ఇక కెరియర్ టర్నింగ్ పాయింట్ అక్కడే దొరుకుతుందని అందరూ చెబుతూ ఉంటారు. కేవలం ఆటపరంగా మాత్రమే కాదు ఫైనాన్షియల్ గా కూడా ఇక లైఫ్ మొత్తం మారిపోతూ ఉంటుంది ఒకసారి ఐపీఎల్లో ఛాన్స్ వస్తే. అయితే ఇప్పటివరకు ఐపీఎల్లో ఎంతో మంది స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్నారు.. ఇక వారిలో ఇప్పుడు వరకు జరిగిన 15 ఐపీఎల్ సీజన్లలో ఎవరు ఎక్కువ మొత్తంలో సంపాదించారు అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఈ లిస్టు చూసుకుంటే ఛాంపియన్ జట్టు అయినా ముంబై ఇండియన్స్ కు కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ ఈ లిస్టులో టాప్ లో ఉన్నాడు అన్నది తెలుస్తుంది.


 మొత్తంగా ఇప్పటివరకు జరిగిన అన్ని సీజన్లో కలిపి రోహిత్ శర్మ 178.6 కోట్లను వేతనంగా పొందాడు అన్నది తెలుస్తుంది. ఇక ఇలా ఎక్కువ సంపాదించిన ఆటగాళ్లలో రోహిత్ శర్మ టాప్ లో ఉండగా ఆ తర్వాత ధోని రెండవ స్థానంలో కొనసాగుతున్నడు. 176.84 కోట్ల రూపాయలను ధోని వేతనంగా పొందాడు. ఇక ఆ తర్వాత బెంగుళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 173.2 కోట్లు, మిస్టర్ ఐపిఎల్ గా ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న సురేష్ రైనా 110 కోట్లు, ఆల్ రౌండర్ జడేజా 109 కోట్లు, సునీల్ నరైన్ 107.5 కోట్లు, డివిలియర్స్ 102.5 కోట్లు సంపాదించారట.

మరింత సమాచారం తెలుసుకోండి: