ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అయిపోయాడు.. దీంతో సంవత్సరానికి ఒకసారి మాత్రమే జరిగే ఐపీఎల్లో మాత్రమే తన ఆటతీరుతో  ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు. ఇక అందరి క్రికెటర్ల లాగా ధోని సోషల్ మీడియాలో అస్సలు యాక్టివ్ గా ఉండడు. ధోని సోషల్ మీడియా అకౌంట్ నుంచి కూడా చాలా అరుదుగా పోస్టులు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇలా సోషల్ మీడియాలో ధోని యాక్టివ్ గా ఉండకపోయినప్పటికీ ధోని కి సంబంధించిన వార్తలు మాత్రం ఎప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతూనే ఉంటాయి అని చెప్పాలి. తమ అభిమాన క్రికెటర్ మిస్టర్ కూల్ కు సంబంధించిన ఏవైనా ఫోటోలు సోషల్ మీడియాలో దొరికాయి అంటే చాలు వాటిని ట్రేండింగ్ గా మార్చేస్తూ ఉంటారు అభిమానులు.


కాగా మహేంద్ర సింగ్ ధోనీకి సంబంధించిన పాత ఫోటోలు వీడియోలు కూడా అప్పుడప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి ట్విట్టర్ వేదికగా తెగ వైరల్ గా మారిపోయింది. వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే మహేంద్ర సింగ్ ధోని ఏకంగా ఒక బైక్ ని స్టార్ట్ చేయడానికి ఎంతో కష్టపడుతూ ఉండడం చూడవచ్చు. సాధారణంగానే మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీకి బైక్స్, కార్స్ అంటే ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేం. ఇప్పటికే ధోని గ్యారేజీలో ఎన్నో రకాల బైక్లు కార్లు ఉన్నాయి అని చెప్పాలి.


 అప్పుడప్పుడు తన గ్యారేజ్ లో ఉన్న బైక్లను తీసుకొని సరదాగా బయటికి వెళ్లడం లాంటివి కూడా చేస్తూ ఉంటాడు మహేంద్ర సింగ్ ధోని. ఈ క్రమంలోనే ధోని కి సంబంధించిన ఒక పాత వీడియో ఇక ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తుంది. ఇందులో భాగంగా ఒక బైక్ నడపాలి అనుకున్న మహేంద్ర సింగ్ ధోనిబైక్ స్టార్ట్ చేయడానికి కిక్ కొడుతూ ఎంతో కష్టపడి పోతున్నాడు. కానీ అది స్టార్ట్ కాలేదు. ఇక ఎంతోసేపు బైక్ ని స్టార్ట్ చేయడానికి ప్రయత్నించిన ధోని చివరికి బైక్ ని స్టార్ట్ చేయకుండానే కాళ్లతో ముందుకు నెడుతూ తీసుకు వెళుతూ ఉండడం ఈ వీడియోలో కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: