
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ కూతురు ప్రస్తుతం పాకిస్తాన్ జట్టులో స్టార్ బౌలర్గా కొనసాగుతున్న షాహిన్ షా ఆఫ్రిది ప్రేమలో కొనసాగుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. మరికొన్ని రోజుల్లో వీరు పెళ్లి కూడా జరగబోతుంది అన్న క్లారిటీ ఎప్పుడో వచ్చేసింది. అయితే ఇటీవల షాహిద్ ఆఫ్రిది కూతురు వివాహం జరగకగా ఆ వేడుకకు షాహీన్ ఆఫ్రిది కూడా హాజరయ్యాడు. అదేంటి షాహిద్ ఆఫ్రిది కూతురుని పెళ్లి చేసుకోవాల్సింది షాహిన్ ఆఫ్రిది కదా.. మరి పెళ్లికి అతను ఒక గెస్ట్ లాగా హాజరు కావడం ఏంటి అని షాక్ అవుతున్నారు కదా.
అయితే ఇటీవలే పెళ్లి చేసుకుంది షాహిద్ ఆఫ్రిది పెద్ద కుమార్తె అక్సా. ఇటీవల నజీర్ అనే వ్యక్తితో ఆమెకు వివాహం జరిగింది. కరాచీలో అత్యంత సన్నిహితులు వివాహం జరగక.. ఇక ఈ పెళ్లికి పాకిస్తాన్ ఫేసర్ షాహిన్ ఆఫ్రిది కూడా హాజరయ్యాడు. ఏకంగా తోడల్లుడి వెనకాల నిలుచుని వేడుకను వీక్షించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారిపోయింది. కాగా షాహిద్ ఆఫ్రిది రెండో కుమార్తె ఆన్స ఆఫ్రిది తో షాహిన్ అఫ్రిది ప్రేమలో ఉండగా వీరి పెళ్లికూడా త్వరలో జరగబోతుంది.