నేటి జనరేషన్ క్రికెటర్లలో అటు విరాట్ కోహ్లీ అత్యుత్తమ ఆటగాడిగా కొనసాగుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. కేవలం ఆట తీరులో మాత్రమే కాదు అతను సాధించిన రికార్డుల విషయంలో కూడా ఎవరికి అందనంత దూరంలో ఉన్నాడు విరాట్ కోహ్లీ. ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్లో ఏకంగా 72 సెంచరీలు  సాధించిన ఆటగాడిగా కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక ఇప్పటివరకు ఎంతోమంది దిగ్గజ క్రికెటర్లు క్రియేట్ చేసిన రికార్డులను సైతం అలవోకగా చేదించి సరికొత్త చరిత్ర సృష్టించాడు విరాట్ కోహ్లీ.


 అందుకే ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని రికార్డుల రారాజు అని కూడా పిలుస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇక ప్రస్తుతం రికార్డుల విషయంలో ఎవరికి అందనంత దూరంలో ఉన్న సచిన్ టెండూల్కర్ ను అటు విరాట్ కోహ్లీ దాటగలడా అనే చర్చ ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. కాగా ఇప్పుడు ఇలాంటి చర్చే తెర మీదకి వచ్చింది. ఇప్పటివరకు విరాట్ కోహ్లీ సాధించిన సెంచరీలలో కేవలం వన్డే ఫార్మాట్లోనే 44 సెంచరీలు సాధించాడు అన్న విషయం తెలిసిందే. ఇక అటు సచిన్ టెండూల్కర్ వన్డే ఫార్మాట్లో 49 సెంచరీలు సాధించడం గమనార్హం.


 అంటే సచిన్ రికార్డును బ్రేక్ చేయడానికి విరాట్ కోహ్లీ కేవలం 6 సెంచరీల దూరంలో మాత్రమే ఉన్నాడు. కాగా ఈ ఏడాది దాదాపు టీమిండియా 27 వన్డే మ్యాచ్లు ఆడబోతుంది అని చెప్పాలి. అయితే సచిన్ రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొట్టగలడా అనే ప్రశ్నకు మాజీ ఆటగాడు సంజయ్ బంగర్ ఆసక్తికర సమాధానం చెప్పాడు. వన్ డే క్రికెట్ లో ఇప్పటికే 44 సెంచరీలు సాధించాడు  కోహ్లీ. ఇక ఏడది టీమిండియా ఏకంగా 27 వన్డే మ్యాచ్ లు ఆడుతుంది. కోహ్లీ ప్రస్తుతం ఫామ్ మునుముందు కూడా కొనసాగిస్తే ఈ సంవత్సరమే సచిన్  ను చేరుకుంటాడు అంటూ ధీమా వ్యక్తం చేస్తాడు సంజయ్ బంగర్.

మరింత సమాచారం తెలుసుకోండి: