
ఇక ప్రస్తుతం ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రిషబ్ పంత్ కోలుకుంటున్నాడు. అయితే ఈరోజు వరకు కూడా రిషబ్ పంత్ ఐసియూలో చికిత్స పొందగా ఇప్పుడు ప్రైవేట్ వార్డ్ కు తరలించినట్లు బిసిసిఐ అప్డేట్ ఇచ్చింది ఇకపోతే యాక్సిడెంట్ పై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా స్పందిస్తూ అతను త్వరగా కోలుకోవాలని అంటూ ఆకాంక్షిస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. విషయంపై స్పందించిన టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇటీవల భారత క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన నేపథ్యంలో ఇక భారత జట్టులో ఉన్న ఆటగాళ్లందరికీ కూడా కపిల్ దేవ్ ఒక కీలక సూచన చేశాడు అని చెప్పాలి. మీ దగ్గర హై స్పీడ్ తో వెళ్లే అద్భుతమైన కార్లు ఉన్నాయి. డ్రైవర్ను పెట్టుకునే స్తోమత కూడా ఉంది. ఎప్పుడు ఒంటరిగా డ్రైవ్ చేయవద్దు అంటూ కపిల్ దేవ్ సూచన చేశాడు. మీ కోసం మీరే ఆలోచించుకోవాలి.. నేను క్రికెటర్ గా ఎదుగుతున్నప్పుడు నాకు బైక్ యాక్సిడెంట్ జరిగింది. అప్పటినుంచి నా సోదరుడు నన్ను వాహనాన్ని ముట్టుకొనివ్వలేదు అంటూ కపిల్దేవ్ గుర్తు చేసుకున్నాడు.