టి20 వరల్డ్ కప్ లో భాగంగా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమిండియా జట్టు అంచనాలను అందుకోలేకపోయింది అన్న విషయం తెలిసిందే. లీగ్ దశలో వరుసగా విజయాలు సాధించిన టీమిండియా అటు కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్లో మాత్రం చేతులెత్తేసింది. ఏకంగా ఇంగ్లాండ్ చేతిలో పది వికెట్ల తేడాతో ఓడిపోయి ఇంటి బాట పట్టింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టీమిండియా ప్రదర్శన పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి అని చెప్పాలి. అయితే టి20 ప్రపంచ కప్ వైఫల్యం తర్వాత అటు జట్టులో ప్రక్షాళన మొదలైంది అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే ఇక బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ వచ్చిన తర్వాత అటు ఏకంగా సెలక్షన్ కమిటీ పై బీసీసీఐ పెద్దలు వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ కాస్త రద్దయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే కొత్త సెలెక్షన్ కమిటీలోకి ఎవరు వస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఇక ఇందుకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ కూడా ఇటీవలే బీసీసీఐ చేపట్టింది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఏకంగా చీఫ్ సెలెక్టర్ పదవిని కోల్పోయిన మాజీ క్రికెటర్ చేతన్ శర్మ కే మరోసారి సెలెక్షన్ కమిటీ చీప్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందట.



 కాగా చేతన్ శర్మతో పాటు ఇంటర్వ్యూకు హాజరైన మరో మాజీ సభ్యుడు హరేందర్ సింగ్ కూడా మరోసారి బీసీఐ సీ సెలక్షన్ కమిటీ లో కనిపించబోతున్నాడట. ఈ క్రమంలోనే సెలక్షన్ కమిటీ కోసం ఇటీవలే ఏకంగా 13 మంది సభ్యులను బీసీసీఐ పెద్దలు షార్ట్ లిస్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఇక త్వరలో వీరిలో ఫైనల్ గా సెలక్షన్ కమిటీలోకి వచ్చేవారు ఎవరు అన్న విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. కాగా మళ్లీ చేతన్ శర్మనే సెలక్షన్ కమిటీ చీప్ గా వస్తాడని టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో అంతమాత్రానికే ఇక సెలక్షన్ కమిటీని రద్దు చేశారా అని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: