ఇటీవల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడుగా ఉన్న రమిజ్ రాజా పదవి కోల్పోయి ఇక ఆ పదవిలోకి కొత్త అధ్యక్షుడిగా నిజం సేథి వచ్చిన తర్వాత లాభపడిన ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే దాదాపు నాలుగేళ్ల నుంచి పాకిస్తాన్ జట్టులో చోటు దక్కక నిరాశలో మునిగిపోయాడు సదరు ఆటగాడు. దేశవాళి క్రికెట్లో బాగా రాణించినప్పటికీ అతన్ని జట్టు ఎంపీకలో మాత్రం పరిగణలోకి తీసుకోలేదు. దీంతో 35 ఏళ్ల వయస్సున్న సర్పరాజు అహ్మద్ కెరియర్ ముగిసిపోయిందని అందరూ అనుకున్నారు.


 కానీ ఇప్పుడు మాత్రం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా సేథి వచ్చిన తర్వాత ఇక చీఫ్ సెలెక్టర్గా షాహిద్ ఆఫ్రిది బాధ్యతలు చేపట్టిన తర్వాత 35 ఏళ్ల సర్పరాజ్ అహ్మద్ మళ్ళీ జట్టులోకి వచ్చాడు. న్యూజిలాండ్తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో అదరగొట్టాడు అని చెప్పాలి. మొదటి టెస్ట్ 2 ఇన్నింగ్స్ లో 86, 53 పరుగులు చేసిన సర్పరాజు అహ్మద్.. ఇక రెండవ మ్యాచ్ లో 78, 118 పరుగులతో చెలరేగిపోయాడు. ఇకపోతే ఇటీవల తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. షాహిద్ భాయ్ చీఫ్ సెలెక్టర్గా బాధ్యతలు చేపట్టగానే నన్ను పిలిచి నువ్వు మ్యాచ్ ఆడుతున్నావు అంటూ చెప్పాడు. బాబర్ కూడా మద్దతుగా నిలిచాడు అంటూచెప్పుకొచ్చాడు.

 ఈ క్రమంలోనే రెండవ టెస్ట్ మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన సర్పరాజ్ అహ్మద్ అటు మాజీ అధ్యక్షుడు రమిజ్ రాజా గురించి ప్రశ్నే ఎదురైంది అని చెప్పాలి.  ఆటగాడిగా నీ కెరియర్ ముగిసిపోయిందని రమిజ్ రాజా అన్నారు. అయితే వచ్చి రాగానే డేరింగ్ సెలెక్టర్ షాహిద్  నీకు ఛాన్స్ ఇచ్చారు. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావ్ అంటూ అటు సర్ఫరాజ్ ను విలేకరులు ప్రశ్నించగా.. క్రికెట్లో రాణించాను సరైన వ్యక్తులు మార్గదర్శనం.. మీడియా ప్రోత్సాహం.. నా కుటుంబం శ్రేయోభిలాషుల మద్దతుతోనే.. ఇక్కడ వరకు వచ్చాను అంటూ అంతేకాకుండా రమిజ్ రాజా తన గురించి మాట్లాడిన మాటలకు ఆటతోని సమాధానం చెప్పానని చెప్పకనే చెప్పాడు సర్పరాజ్ అహ్మద్.

మరింత సమాచారం తెలుసుకోండి: