ఇటీవల కాలంలో సూర్య కుమార్ యాదవ్ తన ఆటతీరుతో భారత క్రికెట్లో ఎంతలా హాట్ టాపిక్ గా మారిపోతు ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ముఖ్యంగా పొట్టిఫార్మాట్లో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ ఉన్నాడు. తన ఆట తీరుతో నయా 360 డిగ్రీస్ ప్లేయర్ గా కూడా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రపంచ నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్న సూర్య కుమార్ యాదవ్ ఇక తన ప్రదర్శనతో ఆస్థానాన్ని నిలబెట్టుకుంటూనే ఉన్నాడు అని చెప్పాలి.


 ఇక ఇటీవలే శ్రీలంకతో జరిగిన మూడో టి20 మ్యాచ్లో కూడా అదిరిపోయే సెంచరీ చేసి అందరిని ఆకట్టుకున్నాడు. ఒక రకంగా చెప్పాలి అంటే శ్రీలంక బౌలర్లతో చెడుగుడు ఆడేశాడు అని చెప్పాలి. ఇక అతని 360 డిగ్రీస్ ఆటతీరుతో శ్రీలంక బౌలర్లు బిత్తర పోయారు. అతనికి బంతి ఎక్కడ వేయాలో తెలియక అయోమయంలో పడిపోయారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే సూర్య కుమార్ యాదవ్ అద్భుతమైన ఇన్నింగ్స్ గురించి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఇలాంటి సమయంలోనే మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా  మారిపోయాయి.


 ఒకవైపు మూడో టి20 లో సూర్యకుమార్ సెంచరీని అద్భుతమైన ఇన్నింగ్స్ అంటూ పొగుడుతూనే.. ఇక టెస్ట్ క్రికెట్లోకి అతను అరంగేట్రం చేయాల్సిన సమయం ఆసన్నమైందంటూ గంభీర్ పోస్ట్ పెట్టాడు. అయితే ఇక ఈ పోస్ట్ పై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తుందని చెప్పాలి. గంభీర్ మీ దగ్గర నుంచి ఉత్తమమైన విషయం ఆశించం. కానీ ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు. ఎందుకు సూర్య కుమార్ నే జట్టులోకి తీసుకోవాలి. రంజీ ట్రోఫీలో అద్భుతంగా రాణిస్తున్న సర్ఫరాజ్ పరిస్థితి ఏంటి.. అతను మాత్రమే కాదు ఇంకా చాలామంది అద్భుతంగా రానిస్తున్నారు. వన్డే టి20 లో ప్రదర్శన ఆధారంగా విభిన్నమైన ఫార్మాట్ అయిన టెస్ట్ ఫార్మాట్లోకి తీసుకోవాలని చెప్పడం సరైనది కాదు అని కొంతమంది అంటుంటే.. సూర్య టెస్టుల్లోకి వస్తే సరికొత్త ప్రభంజనం సృష్టిస్తాడని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: